ETV Bharat / bharat

'రూ.50కోట్లు ఇస్తే ఆ రాష్ట్రంలో వీసీ పదవి'.. గవర్నర్ సంచలన ఆరోపణలు

తమిళనాడులో వైస్ ఛాన్సలర్ పదవిని రూ.40-50 కోట్లకు విక్రయించారని పంజాబ్​ గవర్నర్​ బన్వారీలాల్​ పురోహిత్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

purohit about tamil nadu universities
punjab cm vs punjab governor
author img

By

Published : Oct 22, 2022, 1:48 PM IST

Updated : Oct 22, 2022, 2:08 PM IST

తమిళనాడులో వైస్ ఛాన్సలర్ పదవిని రూ.40-50 కోట్లకు విక్రయించారని పంజాబ్​ గవర్నర్​ బన్వారీలాల్​ పురోహిత్​ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పురోహిత్​.. ఈ మేరకు ఆరోపణలు చేశారు. "నేను తమిళనాడు గవర్నర్​గా నాలుగేళ్లు పని చేశాను. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కో వీసీ పోస్ట్​ రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లకు అమ్ముడు పోయేది" అని గవర్నర్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు గవర్నర్​ హోదాలో తాను 27 మంది వీసీలను చట్టబద్ధంగా నియమించారని తెలిపిన బన్వారీలాల్.. పంజాబ్​ రాష్ట్రం ఈ నియామకాల నుంచి నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ డాక్టర్ సత్బీర్ సింగ్ గోసల్‌ను చట్టవిరుద్ధంగా నియమించారని పురోహిత్​ ఆరోపించారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కోరారు.
మరోవైపు, యూనివర్సిటీ కార్యకలాపాల్లో గవర్నర్​ జోక్యం చేసుకుంటున్నారని పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలపై బన్వారీలాల్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంపై జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు.

ఇదీ చదవండి: లోన్​​ యాప్​లపై ఈడీ కొరడా.. రూ.78 కోట్లు స్వాధీనం..

ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్​గా సోలార్​ ప్యానల్స్.. ఇక కరెంట్ బిల్​ నుంచి విముక్తి!

Last Updated : Oct 22, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.