ETV Bharat / bharat

భారీ వర్షాలతో బెంగళూరు బెంబేలు- వాగులను తలపించిన వీధులు - బెంగళూరు న్యూస్​

భారీ వర్షాలు కర్ణాటకను అతలాకుతలం చేశాయి. బెంగళూరులోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి(bangalore rains ). వీధులు వాగులను తలపించాయి. ఇళ్లు నీటమునిగాయి. కొన్ని చోట్ల స్థానికులు పడవలను ఉపయోగించి ఇళ్లకు చేరుకున్నారు.

Bengaluru rains, బెంగళూరు వర్షాలు
భారీ వర్షాలతో బెంగళూరు బెంబేలు- వాగులను తలపించిన వీధులు
author img

By

Published : Nov 22, 2021, 7:51 PM IST

భారీ వర్షాలతో బెంగళూరు బెంబేలు- వాగులను తలపించిన వీధులు

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కర్ణాటకను బెంబేలెత్తించాయి. ముఖ్యంగా రాజధాని నగరం బెంగళూరులో వరదల కారణంగా జనజీవనం స్తంభించింది(bangalore rains). రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. అపార్ట్​మెంట్లలోకి కూడా వరద నీరు వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, బైక్​లు వరదలో కొట్టుకుపోయాయి. ఉత్తర బెంగళూరు వరదల కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అలలసంద్ర సరస్సు పొంగిపొర్లి సమీప ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. యెలహంకలో 134 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఏకధాటిగా 24 గంటల పాటు వర్షం కురిసింది. ఫలితంగా కేంద్రీయ విహార్​లోని అపార్ట్​మెంట్​​ కాంప్లెక్స్​లోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడ నివాసముండే 600 కుటుంబాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. చిక్కబళ్లాపుర్​ సహా ఇతర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది పడవల ద్వారా సురక్షిత ప్రంతాలకు తరలించారు(bangalore flood).

Very heavy rain lashes the Northern part of Bengaluru
పడవలో వెళ్తున్న స్థానికులు, వరదలోనే అంబులెన్స్ ప్రయాణం

రూ.500కోట్లు విడుదల..

కర్ణాటకలో ఓ ఇంట్లోకి చేరిన వరద నీరు

వరదల కారణంగా పాడైన రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేసేందుకు రూ.500కోట్లు తక్షణమే విడుదల చేయనున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. భారీ వర్షాల వల్ల ఇళ్లు ధ్వంసమైన వారికి రూ.లక్ష సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు. వరదల కారణంగా జరిగిన పంటనష్టం అంచనా వేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికార యంత్రంగానికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు(karnataka rain news). వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కొలార్ జిల్లాను సీఎం స్వయంగా సందర్శించారు.

ఇదీ చదవండి: వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.