Venkaiah Naidu on Movies: బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సినిమా లక్ష్యం వినోదం మాత్రమే కారాదని, యువతలో నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా చలనచిత్రాలు తీయాలని నిర్మాతలకు సూచించారు. సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన 'రాజ్ కపూర్- ది మాస్టర్ ఎట్ వర్క్' పుస్తకాన్ని దిల్లీలో ఉప రాష్ట్రపతి మంగళవారం ఆవిష్కరించారు.
Venkaiah Naidu on Cinema: అనంతరం మాట్లాడిన వెంకయ్య.. చలనచిత్రాల్లో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, అసభ్యత యువత మనసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయన్నారు. రాజ్‌కపూర్ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయితను అభినందించారు. 'ఆవారా హూ' వంటి చిరస్మరణీయమైన గీతాలు అనేక దేశాల్లో ప్రజాదరణ పొందాయని తెలిపారు. కార్యక్రమంలో రాజ్ కపూర్ కుమారుడు రణధీర్ కపూర్, సినీ నటుడు రణబీర్ కపూర్, కాలమిస్ట్ సుహేల్ సేథ్, బ్లూమ్స్‌బరీ ఇండియాకు చెందిన మీనాక్షి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్‌కు రాష్ట్రపతి