ETV Bharat / bharat

యంత్రంలో రూపాయి పెట్టు.. మాస్కు పట్టు! - తక్కువ ధరకే మాస్క్

కార్డు పెట్టి పిన్​ ఎంటర్ చేస్తే.. ఏటీఏం మిషన్​లో డబ్బులు వచ్చినట్లుగానే, రెండు రూపాయల కాయిన్​ వేసి మిషన్​పై నిల్చుంటే మనిషి బరువెంతో తెలిసినట్లుగానే.. ఇప్పుడు రూపాయి లేదా ఐదు రూపాయల కాయిన్​ వేస్తే ఓ యంత్రంలో నుంచి మాస్క్​ వస్తోంది. తొందరలో మాస్క్​ మరిచిపోయి బయటకు వెళ్లే వారికోసం ఈ యంత్రాన్ని రూపొందించారు ఇద్దరు సూరత్​ వాసులు. మరి ఈ యంత్రం ప్రత్యేకతలను చూసేద్దామా!

Vending machine that delivers mask for just Rs 1
రూ.1కే మాస్క్​ అందిస్తున్న వెండింగ్ మిషన్.. ఎక్కడ ఉందంటే?
author img

By

Published : Mar 28, 2021, 5:21 PM IST

Updated : Mar 28, 2021, 5:29 PM IST

రూ.1కే మాస్క్​ అందిస్తున్న వెండింగ్ మిషన్

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా కొన్ని రాష్ట్రాల కఠిన నిబంధనల నేపథ్యంలో.. మాస్క్​ ధరించడం తప్పనిసరి అయింది. హడావుడిగా బయటకు వెళ్లిన చాలా మంది 'అయ్యో! మాస్క్​ మర్చిపోయామే!' అని తలపట్టుకోవాల్సి వస్తోంది. మాస్క్​ లేకుండా పట్టుబడితే అధికారులు విధిస్తున్న జరిమానా వివరాలు చూస్తే ఈ పరిస్థితి అర్థమవుతుంది. అయితే.. ఇలాంటి వారికోసం వినూత్నంగా ఆలోచించి ఓ యంత్రాన్ని తయారు చేశారు సూరత్​కు చెందిన ఓ సామాజిక కార్యకర్త. ఒక్క రూపాయి లేదా ఐదు రూపాయల కాయిన్​ను మిషిన్​లో వేస్తే.. బయటకు మాస్క్​ వస్తుంది. ఆమె స్నేహితుడి సాయంతో ఈ మిషన్​ను రూపొందించారు. ఈ మిషన్​ ఎంతో మందికి ఉపయోగపడుతుందని ధీమాగా ఉన్నారు.

Vending machine that delivers mask for just Rs 1
5000 వేల వరకు మాస్కులు అమర్చే సామర్థ్యం

"మాస్క్​ ధరించని వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫైన్​లు విధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాస్క్​ మరిచిపోయిన వారికోసం ఈ వెండింగ్ మిషన్​ చాలా ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో 100 నుంచి 5000 మాస్క్​లు పొందుపరిచే అవకాశం ఉంది. రూపాయి లేదా ఐదు రూపాయల నాణెం వేసి ఈ మాస్క్​ పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో బస్టాండ్​లో, రైల్వేస్టేషన్​లలో, ఇతర ప్రాంతాల్లోనూ ఈ మిషన్​ను​ ఏర్పాటు చేస్తాం."

--రూపా షా, సామాజిక కార్యకర్త.

ఈ మిషన్​ను ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెబుతున్నారు మిషన్​ రూపకర్తలు.

వెండింగ్​ మిషన్​ గురించి వివరిస్తున్న మిషన్​ రూపకర్తలు

వాస్తవానికి మహిళలకు శానిటరీ ప్యాడ్స్​ అందుబాటులో ఉంచేందుకు ఈ మిషన్​ తయారు చేశారు. అయితే.. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దీన్ని మాస్కుల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. మెడికల్​ షాపుల కంటే తక్కువ ధరకే ఈ మాస్క్​ను అందించడం విశేషం.

"ఆత్మనిర్భర్ భారత్, మేక్​ ఇన్​ ఇండియా ప్రేరణతో ఈ మిషన్​ తయారు చేశాను. ఓ కాయిన్​తో సులభంగా ఈ మాస్క్​ను పొందవచ్చు. మెడికల్​ షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ నిలబడాల్సిన పనిలేదు. ఈ యంత్రం ఏటీఎంలా పనిచేస్తుంది."

--రిషభ్​ షా, యంత్రం రూపకర్త.

మాస్క్​ లేకుండా పోలీసులకు చిక్కితే జరిమానా కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కాకుండా కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా ఈ యంత్రాన్ని తయారు చేశామని మిషన్​ రూపకర్తలు చెబుతున్నారు. ఇది తయారు చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు.

కాయిన్​ వేస్తే మాస్కు బయటకు వచ్చేలా తయారీ

ఇదీ చదవండి:దేశంలో మరో 62,714 కరోనా కేసులు

Last Updated : Mar 28, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.