కాంగ్రెస్ సీనియర్ నేత, రచయిత ఎమ్ వీరప్ప మొయిలీని.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అరుంధతి సుబ్రమణియన్‌తో పాటు మరో 18మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. ఈ మేరకు 'నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్' శుక్రవారం ప్రకటించింది.
'శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం' అనే ఇతిహాస కవిత్వం రాసినందుకు మొయిలీకి అవార్డు వచ్చింది. సుబ్రమణియన్ రాసిన 'వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్' అనే ఇంగ్లీషు కవితకు అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారిలో నిఖిలేశ్వర్(తెలుగు) , హరిశ్ మీనాక్షీ(గుజరాతీ), అనామికా(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణీ)తదితరులు ఉన్నారు. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్థానీ భాషలకు అవార్డులు తరువాత తేదీలో ప్రకటించనున్నట్లు అకాడమీ తెలిపింది.
ఇదీ చూడండి: కేరళ ఆనవాయితీ మారేనా? సర్వేలన్నీ వామపక్షాల వైపే!