ETV Bharat / bharat

ధాన్యం తగలబెట్టిన రైతు- వరుణ్ గాంధీ కీలక ట్వీట్​ - వరుణ్​ గాంధీ వీడియో

లఖింపుర్‌లో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెడుతున్న దృశ్యాలను భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ ట్వీట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. రైతు తాను పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 15 రోజులుగా వ్యవసాయ మార్కెట్‌లకు కాళ్లరిగేలా తిరుగుతున్నారని, ఇలాంటి వ్యవస్థ రైతులను ఎక్కడికి తీసుకువెళుతోందంటూ ప్రశ్నించారు.

varun-gandhi-targets-yogi-government-and-shared-video-of-farmer-burning-paddy-of-lakhimpur-kheri
ధాన్యం తగలబెట్టిన రైతు- భాజపాను ప్రశ్నించిన వరుణ్ గాంధీ
author img

By

Published : Oct 23, 2021, 5:43 PM IST

దేశంలో అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉందని భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ అన్నారు. లఖింపుర్‌లో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెడుతున్న దృశ్యాలను ట్వీట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రైతు తాను పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 15 రోజులుగా వ్యవసాయ మార్కెట్‌లకు కాళ్లరిగేలా తిరుగుతున్నారని పేర్కొన్నారు. కానీ ఫలితం లేకపోవడం వల్ల ఆశలన్నీ వదిలేసుకుని స్వయంగా దానికి నిప్పు పెట్టారని వరుణ్‌ గాంధీ తెలిపారు. ఇలాంటి వ్యవస్థ రైతులనుఎక్కడికి తీసుకువెళుతోందంటూ ప్రశ్నించారు.

  • उत्तर प्रदेश के किसान श्री समोध सिंह पिछले 15 दिनों से अपनी धान की फसल को बेचने के लिए मंडियों में मारे-मारे फिर रहे थे, जब धान बिका नहीं तो निराश होकर इसमें स्वयं आग लगा दी।

    इस व्यवस्था ने किसानों को कहाँ लाकर खड़ा कर दिया है? कृषि नीति पर पुनर्चिंतन आज की सबसे बड़ी ज़रूरत है। pic.twitter.com/z3EjYw9rIz

    — Varun Gandhi (@varungandhi80) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం వ్యవసాయ విధానాలపై పునరాలోచించడం అన్నిటికంటే పెద్ద అవసరమని వరుణ్‌ రాసుకొచ్చారు. మరోవైపు ఇప్పటికే ఆయా సందర్భాల్లో రైతులకు మద్దతు పలికి తన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో వరుణ్‌ గాంధీ చోటు కోల్పోయారు. తెరాయ్ ప్రాంతంలో వరదల ఫొటోలను ట్వీట్ చేస్తూ సహాయక చర్యల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించారు.

ఇదీ చదవండి: యూపీలో కాంగ్రెస్ యాత్ర- మహిళా రైతులతో ప్రియాంక ముచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.