ETV Bharat / bharat

నేడు కరోనా కట్టడిపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష

కరోనా మహమ్మారి ఉద్ధృతి అధికంగా ఉన్న 11 రాష్ట్రాలతో నేడు సమావేశంకానున్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. కరోనా కేసుల అనూహ్య వృద్ధి, వైరస్​ వ్యాప్తిని అరికట్టే చర్యలపై సమీక్షించనున్నారు.

Harsha vardhan
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
author img

By

Published : Apr 6, 2021, 5:23 AM IST

దేశంలో కరోనా కేసుల వృద్ధి అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌.. నేడు 11 రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. వైరస్​ ఉద్ధృతి, అరికట్టే చర్యలపై.. ఆయా రాష్ట్రాల మంత్రులతో చర్చిస్తారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆరోగ్య శాఖ భేటీలో.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు కేంద్ర మంత్రి. దేశంలో..రోజువారీ కేసుల వృద్ధిలో 82శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రలో ఆదివారం అత్యధికంగా 57వేల కేసుల వచ్చాయి. అది దేశంలోని మొత్తం కేసుల్లో 55.11 శాతంగా ఉంది. ఆ తర్వాత ఛత్తీస్​గఢ్​లో 5వేలు, కర్ణాటకలో 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, కేరళ, పంజాబ్​లే దేశవ్యాప్త కేసుల్లో 75.88 శాతం భర్తీ చేస్తున్నాయి.

ఇదీ చూడండి: వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.