ETV Bharat / bharat

గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!

Vande Mataram Song On Kite Thread : కేవలం 23 సెంటిమీటర్ల దారంపై 20 నిమిషాల్లోనే జాతీయ గేయం 'వందేమాతరం' ను లిఖించాడు దిల్లీకి చెందిన అతుల్​ కశ్యప్. దీంతో అతడు వరల్డ్​ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు. ఇదే కాకుండా మైక్రో ఆర్టిస్ట్​గా మరెన్నో అద్భుతాలు చేశాడు ఈ యువకుడు. మరి వాటన్నింటిపై ఓ లుక్కేద్దాం రండి.

Atul Kashyap Secured A Place In The World Book Of Records
Vande Mataram Song On Kite Thread Guinness Book Of World Records
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 2:49 PM IST

గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!

Vande Mataram Song On Kite Thread : 23 సెంటిమీటర్ల గాలిపటం దారంపై జాతీయ గేయాన్ని రాసి రికార్డు సాధించాడు దిల్లీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అతుల్​ కశ్యప్. 20 నిమిషాల్లోనే 'వందేమాతరం' గేయాన్ని దారంపై రాసేశాడు. అతడి ప్రతిభను గుర్తించి ధ్రువపత్రాన్ని అందించింది వరల్డ్​ బుక్​ ఆఫ్ రికార్డ్స్​​.

Atul Kashyap Secured A Place In The World Book Of Records
గాలిపటం దారంపై అతుల్​ కశ్యప్​ రాసిన వందేమాతరం గేయం

అతుల్​ కశ్యప్​ స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరుఖాబాద్. గత పదేళ్లుగా అతడు కుటుంబంతో కలిసి దిల్లీలోని గోవింద్‌పురి కల్కాజీలో నివాసం ఉంటున్నాడు. మైక్రో ఆర్ట్​లో ఆసక్తి ఉన్న అతడు.. ఇప్పటికే వివిధ కళారూపాల్లో​ తన ప్రతిభను చాటుకున్నాడు. త్వరలో 3 మిల్లీ మీటర్ల చిన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాసేందుకు సిద్ధమయ్యాడు.

అతుల్​ కశ్యప్ సాధించిన వరల్డ్​ బుక్​ ఆఫ్ రికార్డు

"మైక్రో ఆర్ట్​ అనేది నా అభిరుచి. నన్ను నేను కాస్త వైవిధ్యంగా చూసుకునేందుకు నా ఈ కళను ప్రపంచానికి చూపించాలనుకున్నా. నా ప్రతిభకు మీ(మీడియా) ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. 23 సె.మీల దారంపై 20 నిమిషాల్లో జాతీయ గేయాన్ని రాసేందుకు నేను సుదీర్ఘంగా సాధన చేశాను. ఇందుకోసం సుమారు 6 నెలలు దారాలపై రాస్తూ రాస్తూ పట్టు సాధించాను. అంతేకాకుండా 2005లో కాన్పుర్​ విశ్వవిద్యాలయంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆవగింజపై 'ఐ లవ్​ మై ఇండియా' అని రాశాను. ఇది పేపర్లలో కూడా వచ్చింది. ఇక 3మి.మీల పుస్తకంపై హనుమాన్​ చాలీసా రాసేందుకు పుస్తకం కూడా సిద్ధం చేశాను. అందులో రాయాల్సి ఉంది. ప్రస్తుతం సాధన చేస్తున్నాను."
- అతుల్​ కశ్యప్​, మైక్రో ఆర్టిస్ట్​

భవిష్యత్​లో మరికొన్ని రికార్డులను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు అతుల్​ కశ్యప్​. ఇందులో భాగంగానే బియ్యం గింజపై గాయత్రి మంత్రాన్ని రాసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.

వందేమాతరం గేయానికి అతుల్​ సాధించిన ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డు

ఒకేసారి వందకిపైగా దారాలు..!
ఇవే కాకుండా గోధుమ గింజ పరిమాణంలో మట్టితో దీపాలను తయారు చేసి వెలిగించాడు అతుల్​. అలాగే సూది రంధ్రం లోపలి నుంచి ఒకేసారి 100 కంటే ఎక్కువ దారాలను పంపించి ఘనత సాధించాడు. అయితే వీటిని పూర్తి చేసేందుకు ఇంతకుముందు నెలల సమయం పట్టేదని.. కానీ ఇప్పుడు నిమిషాల్లోనే వీటిని పూర్తి చేస్తున్నట్లు తెలిపాడు. ఇదంతా నిరంతర సాధన వల్ల తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతోనే సాధ్యమైందని చెబుతున్నాడు కశ్యప్​. యువతలో స్ఫూర్తిని నింపేందుకే తను ఇలా చేస్తున్నానని, భవిష్యత్తులో కూడా మైక్రో ఆర్ట్​ కళ ద్వారా ఇలాంటి ఎన్నో రకాల కళారూపాలను ప్రజల ముందుకు తీసుకొస్తానని అంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్​​.

కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు - పోలీసులకు పట్టించిన గ్రామస్థులు

పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్​జెండర్​- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.