కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. ప్రస్తుత విధానం అంతా సమస్యలమయం అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
"ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. వ్యాక్సిన్ కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృతం చేయాలి. వ్యాక్సిన్ పంపిణీని వికేంద్రీకృతం చేయాలి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వ్యాక్సిన్ విధానం.. వివక్షాపూరితంగా ఉందని విమర్శిస్తోంది.
ఇదీ చూడండి: 'సీబీఎస్‌ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు'
ఇదీ చూడండి: 'మహా'లో బ్లాక్ ఫంగస్ పంజా.. 52 మంది మృతి!