ETV Bharat / bharat

'చిన్నారులకు టీకాపై నిర్ణయం వచ్చే ఏడాదే'

author img

By

Published : Dec 8, 2021, 8:31 AM IST

Vaccine for children: చిన్నారులకు కరోనా టీకా ఇచ్చే విషయంపై నిపుణుల బృందం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని స్పష్టం చేసింది. ఎప్పుడు ఇవ్వాలనే విషయాన్ని వచ్చే ఏడాది నిర్ణయిస్తామని చెప్పుకొచ్చింది.

kids vaccination
vaccine for children

Kids vaccination: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 35 దేశాల్లో కేసులు వెలుగుచూశాయి. భారత్‌లోనూ పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో బూస్టర్‌ డోసులు, పిల్లలకు టీకాలు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్​టీఏజీఐ) పిల్లలకు టీకాల విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని తెలిపింది. వారికి ఎప్పుడు ఇవ్వాలో వచ్చే ఏడాదే నిర్ణయిస్తామని వెల్లడించింది.

Children vaccine in India

Vaccine for children:

అదనపు డోసులు, పిల్లలకు వ్యాక్సిన్లపై ఈ భేటీ కొనసాగింది. కాగా పిల్లలకు టీకాల విషయంపై ప్రభుత్వాని ఇప్పటివరకు ఎలాంటి సిఫార్సులు చేయలేదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ అధికారులు వెల్లడించారు.

Children covid vaccine India

పిల్లలకు టీకాల విషయంపై నిపుణుల సూచన మేరకే నిర్ణయం తీసుకుంటామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ పార్లమెంట్​ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ స్పందించడం గమనార్హం. కరోనా మహమ్మారిపై లోక్​సభలో గత శుక్రవారం సుదీర్ఘ చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే మాండవీయ మాట్లాడుతూ.. బూస్టర్​ డోసు సహా పిల్లలకు కొవిడ్​ టీకాపై నిపుణుల సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి వెల్లడించారు. కొవిడ్‌పై దేశం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'ఆర్డర్లు లేవు.. కొవిషీల్డ్‌ ఉత్పత్తిని 50% తగ్గిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.