ETV Bharat / bharat

12-14 ఏళ్ల పిల్లలకు మార్చి నుంచి కరోనా టీకా​

Vaccination for 12-14 age group: దేశంలో 12-14 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా పంపిణీ మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.

Vaccination
పిల్లలకు వ్యాక్సిన్​
author img

By

Published : Jan 17, 2022, 5:29 PM IST

Updated : Jan 17, 2022, 6:25 PM IST

Vaccination for 12-14 age group: దేశంలో 12-14 ఏళ్ల వయసు పిల్లలకు టీకా అందించే ప్రక్రియ 2022, మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి నాటికి 15-18 ఏళ్ల వయసు పిల్లలకు టీకా అందించటం పూర్తవుతుందని, ఆ తర్వాత 12-14 ఏళ్ల వారికి టీకా అందించే అవకాశం ఉందని తెలిపారు కొవిడ్​-19 వర్కింగ్​ గ్రూప్​ ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే అరోడా.

దేశంలో 7.40 కోట్ల మంది 15-18 ఏళ్ల వయసు పిల్లలు ఉన్నట్లు అంచనా. అందులో 3.45 కోట్ల మందికి ఇప్పటికే తొలి డోసు కొవాగ్జిన్​ను పంపిణీ చేశారు. వీరు 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

" 15-18 ఏళ్ల వయసు పిల్లలు కరోనా టీకా పంపిణీలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే.. జనవరి చివరి నాటికి తొలి డోసు పంపిణీ పూర్తవుతుంది. అలాగే.. ఫిబ్రవరి చివరి నాటికి రెండో డోసు తీసుకోవటం కూడా ముగుస్తుంది. 15-18 ఏళ్ల వారికి పూర్తిస్థాయిలో టీకా పంపిణీ ముగిశాక.. 12-14 ఏళ్ల వారికి టీకా ఇచ్చే విషయంపై ప్రభుత్వం మార్చిలో నిర్ణయం తీసుకుంటుంది."

- డాక్టర్​ ఎన్​కే అరోడా, కొవిడ్​ వర్కింగ్​ గ్రూప్​ ఛైర్మన్​.

దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలు దాదాపు 7.5 కోట్ల మంది ఉన్నట్లు చెప్పారు డాక్టర్​ అరోడా. వారికి కొవిడ్​ టీకాలు వేసేందుకు మార్చిలో ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:

'హిమాలయాల్లో పెరిగే మొక్కలో 'కొవిడ్​'ను నిరోధించే శక్తి!'

Last Updated : Jan 17, 2022, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.