ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం - ఉత్తర్​ప్రదేశ్​లో బైక్ ప్రమాదం

పెళ్లికి వెళుతుండగా వ్యాన్​ను.. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఎనిమిది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో వైపు పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదానికి గురై చనిపోయాడు. ఈ ఘటన కూడా ఉత్తర్​ప్రదేశ్​లోనే జరిగింది.

uttarpradhesh-road-accident-several-killed-truck-hits-pickup-van-in-up
ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 7, 2023, 7:09 PM IST

Updated : May 7, 2023, 8:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులతో పెళ్లికి వెళుతున్న వ్యాన్​ను.. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఎనిమిది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొరాదాబాద్ జిల్లాలో భగత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్పత్‌పుర్ రోడ్డు.. ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో మొత్తం 26 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.

మృతులను రజియా (14), మునీజా (18), అనిఫా (42), హుకుమత్ (60), ముస్తఫా (25), ఆసిఫ్ (40), మహ్మద్ ఆలం (36), జుబేర్ (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరిని మొదట జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా.. వారి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు.

uttarpradhesh-road-accident-several-killed-truck-hits-pickup-van-in-up
పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

నీట్​ పరీక్షకు వెళ్తూ ప్రమాదం
నీట్​ పరీక్ష రాసేందుకు బైక్​పై వెళ్తున్న 18 ఏళ్ల యువకుడిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు ఆ యువకుడు. ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరాన్‌పుర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని రుచిత్ కాంబోజ్​గా పోలీసులు గుర్తించారు. అతడు మొహల్లా దుర్గా కాలనీకి చెందిన వ్యక్తి అని వారు తెలిపారు. రుచిత్ తన స్నేహితుడితో కలిసి దేవాబాద్​కు నీట్​ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. సర్సావా ప్రాంతంలో ట్రక్కు​ వీరి బైక్​ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్​ అక్కడి నుంచి పారిపోయాడు. రుచిత్​ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు పేర్కొన్నారు.

బస్సుకు మంటలు..
మధ్యప్రదేశ్​లో ఓ ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. బస్సు కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దతియా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. దతియా, బిండ్​ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న.. టేడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయిందని వారు వెల్లడించారు. షాట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటల్లో ప్రయాణికుల సామానులు పూర్తిగా దగ్ధం అయినట్లు వారు వివరించారు.

Last Updated : May 7, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.