ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాకు(Up varanasi sand eating) చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కుష్మావతి దేవి.. ఇసుకునే ఆహారంగా(Sand eating lady) తీసుకుంటోంది. చోలాపూర్‌లోని కఠారి గ్రామంలో నివసిస్తున్న ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ వయసులోనూ ఇంటి పనులు, పొలం పనులు చకచకా చేసుకుంటుందని.. మిగిలినవారి కంటే చాలా చురుకుగానూ ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
"ఇసుక మాత్రమే తింటున్న ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. 15 ఏళ్ల వయసులో కడుపులో ఇబ్బందిగా అనిపించడం వల్ల ఆమె తొలిసారి ఇసుక తినేసింది. అది ఆమెకు చాలా సౌకర్యంగా అనిపించడం వల్ల అప్పటి నుంచి ఇసుకను మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. నిజానికి తన ఆరోగ్య రహస్యం ఇసుక తినడమేనని ఆమె చెబుతుంటుంది."
-కుటుంబ సభ్యులు.
కుష్మావతి దేవి ఇసుక తీసుకోవడానికి మానసిక సమస్య కారణం(Sand eating disorder) కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. శరీరంలో జింక్, ఐరన్ లోపం ఉన్నవారు ఇలా ఇసుకను ఆహారంగా తీసుకుంటారని చెబుతున్నారు.
ఇసుక తినొద్దని ఆమె కుమారుడు, మనవళ్లు, బంధువులు ఎంత చెప్పినా.. ఆమె వినట్లేదు. ఈ అలవాటు మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాలని కుటుంబ సభ్యులు భావించినా.. అందకూ అంగీకరించట్లేదు. అయితే స్థానిక వైద్యుడు ఒకరు పాలతో కలిపి ఇసుకను తీసుకోవాలని ఆమెకు సూచించారు.
ఇవీ చదవండి: