Uttarakhand Tunnel Update : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్‌క్యారీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు ఆదివారం మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని పైపుల నుంచి బయటకు తీయగానే మనుషులే డ్రిల్లింగ్ చేయనున్నారు. ఇందుకు సమయం ఎక్కువ పట్టే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. సొరంగం లోపల పనిచేస్తున్న సహాయ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత కోసం గొడుగులాంటి నిర్మాణం చేపడుతున్నారు.
-
Uttarkashi (Uttarakhand) tunnel rescue | Preparation of protection umbrella underway inside the tunnel where the people from the rescue team are working. pic.twitter.com/nlScvvs4zy
— ANI (@ANI) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Uttarkashi (Uttarakhand) tunnel rescue | Preparation of protection umbrella underway inside the tunnel where the people from the rescue team are working. pic.twitter.com/nlScvvs4zy
— ANI (@ANI) November 26, 2023Uttarkashi (Uttarakhand) tunnel rescue | Preparation of protection umbrella underway inside the tunnel where the people from the rescue team are working. pic.twitter.com/nlScvvs4zy
— ANI (@ANI) November 26, 2023
అలాగే లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులతో మాట్లాడేందుకు BSNL సిబ్బంది ల్యాండ్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫోన్ ద్వారా కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కల్పించనున్నారు. ఇందుకోసం చిన్నపాటి టెలిఫోన్ ఎక్సేంజ్‌ను సొరంగంలోపల BSNL ఏర్పాటు చేస్తోంది. ఈనెల 12 నుంచి లోపలే ఉన్న కార్మికుల్లో మానసిక స్థైర్యం కల్పించేందుకు వారికి కొన్ని మొబైల్ ఫోన్లు పంపినట్లు అధికారులు చెప్పారు. వాటిలో గేమ్‌లు ఆడుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు. మొబైల్ టవర్ సిగ్నల్స్ లేనందున.. వైఫై ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు.
-
Visuals from outside Silkyara tunnel in Uttarkashi, Uttarakhand where 41 workers are trapped since November 12.#UttarakhandTunnelRescue pic.twitter.com/LlRuxusfqF
— Press Trust of India (@PTI_News) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Visuals from outside Silkyara tunnel in Uttarkashi, Uttarakhand where 41 workers are trapped since November 12.#UttarakhandTunnelRescue pic.twitter.com/LlRuxusfqF
— Press Trust of India (@PTI_News) November 26, 2023Visuals from outside Silkyara tunnel in Uttarkashi, Uttarakhand where 41 workers are trapped since November 12.#UttarakhandTunnelRescue pic.twitter.com/LlRuxusfqF
— Press Trust of India (@PTI_News) November 26, 2023
సొరంగంలో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. ఘటనాస్థలిలో జరుగుతున్న సహాయక చర్యల పురోగతి గురించి ప్రధాని మోదీ ప్రతీరోజూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. కూలీలందర్ని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ధామీ పేర్కొన్నారు.
పూజలు చేసిన స్థానికులు
సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చాలా సమయం పట్టొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు శనివారం తెలిపారు. మరోవైపు.. సొరంగంలో నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక చర్యలకు తరచుగా అంతరాయం కలుగుతున్న వేళ.. ఉత్తరకాశీలోని స్థానిక గ్రామ ప్రజలు పూజలు చేశారు. కూలీలంతా సురక్షితంగా బయటకు రావాలని పూజలు చేశారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలను వీలైనంత వేగంగా వారి కుటుంబాల చెంతకు చేర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా వారు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం.. ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం పాక్షికంగా కూలిపోయింది. ఉత్తరకాశి జిల్లాలోని బ్రహ్మకల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్‌యారా, దండలగావ్ మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్‌లో కొంతమేర కూలిపోయింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అగర్ యంత్రంలో సమస్యలు- సహాయక చర్యలకు అంతరాయం, కూలీల వెలికితీత మరింత ఆలస్యం!
రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లీ బ్రేక్- మాన్యువల్ డ్రిల్లింగ్కు రెడీ, ఉన్నతాధికారులతో చర్చలు