ETV Bharat / bharat

అగర్ ​యంత్రంలో సమస్యలు- సహాయక చర్యలకు అంతరాయం, కూలీల వెలికితీత మరింత ఆలస్యం!

author img

By PTI

Published : Nov 24, 2023, 7:13 AM IST

Updated : Nov 24, 2023, 8:30 AM IST

Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్​ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు మరింత సమయం పట్టేటట్లు ఉంది. అగర్ ​యంత్రంలో సమస్యలు తలెత్తడం వల్లే గురువారం పూర్తి కావాల్సిన పని ఆలస్యమైందని అధికారులు తెలిపారు.

Uttarakhand Tunnel Rescue Operation
Uttarakhand Tunnel Rescue Operation

Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు శుక్రవారం లేదా శనివారంలోగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. కార్మికులను చేరుకునే చివరి 12 మీటర్ల గొట్టపు మార్గపు పనిలో అవాంతరాలు ఏర్పడటం వల్ల ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆగర్ యంత్రంలో మూడు సార్లు సమస్యలు తలెత్తడం వల్ల గురువారం పూర్తి కావాల్సిన పని ఆలస్యమైనట్లు చెప్పారు.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Late night visuals from outside the tunnel

    Drilling work was halted after a technical snag in the Auger drilling machine. Till now, rescuers have drilled up to 46.8 meters in the Silkyara tunnel pic.twitter.com/EqwoifaQsT

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Uttarkashi Tunnel Rescue Update : మరోవైపు డ్రిల్లింగ్ పనుల కోసం రప్పించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల్ని చేరుకునేందుకు వర్టికల్ డ్రిల్లింగ్‌ను సైతం చేయాలా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

  • Uttarakhand CM Pushkar Singh Dhami had a conversation with Gabbar Singh Negi and Saba Ahmed, among the workers trapped in the tunnel under construction in Silkyara, Uttarkashi, to inquire about their well-being and also informed them about the rescue operation going on at a fast… pic.twitter.com/DmRWu0runR

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ గురువారం రాత్రంతా టన్నెల్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చే పనుల దృష్ట్యా ఉత్తరాఖండ్‌లో జరుపుకొనే "ఇగాస్" పండగకు సీఎం దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • Uttarkashi (Uttarakhand) tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami reached Silkyara Tunnel (Uttarakashi) and offered prayers at a temple that has been built at the main entrance of the tunnel where rescue operations to bring out the trapped workers are underway.

    (Pic… pic.twitter.com/voYuZV9D5u

'వారి మనోనిబ్బరం భేష్'
పాక్షికంగా కూలిన సొరంగంలో చిక్కుకున్నవారిలో గబ్బర్​సింగ్ నేగి, సబా అహ్మద్ అనే ఇద్దరు కూలీలతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ ధామీ మాట్లాడారు. వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి అతి దగ్గరలోనే ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం వారి మనో నిబ్బరాన్ని కొనియాడారు.

Uttarakhand Tunnel Latest News : గురువారం దిల్లీ, రూర్కీ నుంచి టన్నెల్‌ నిపుణులు, వెల్డింగ్ నిపుణులను సొరంగం వద్దకు చేరుకున్నారు. మరో ఆరు మీటర్లు పైపులైన్‌ను చేర్చగలిగితే.. కార్మికులను చేరుకోవచ్చని పీఎంఓ మాజీ సలహాదారు భాస్కర్‌ ఖుల్బే చెప్పారు. ఇందుకు 12 నుంచి 14 గంటల సమయం పట్టొచ్చని ఖుల్బే అభిప్రాయపడ్డారు. తర్వాత కార్మికులను బయటకు తేవడానికి మరో 3 గంటలు పట్టొచ్చని చెప్పారు. అయితే గొట్టపు మార్గాల్లో అవాంతరాలు ఏర్పడడం వల్ల కూలీల వెలికితీత మరింత ఆలస్యం కానుంది.

మరి కొద్ది గంటల్లో సొరంగం నుంచి కార్మికులు బయటకు- 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం, ఘటనాస్థలికి సీఎం

'సొరంగంలో చిక్కుకున్నవారంతా సేఫ్​'- కుటుంబ సభ్యులతో మాట్లాడిన కూలీలు, ఆపరేషన్ మరింత ముమ్మరం

Last Updated : Nov 24, 2023, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.