ETV Bharat / bharat

Uttarakhand Floods : భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ గజగజ.. పేకమేడలా కూలిన డిఫెన్స్‌ కాలేజీ - ఉత్తరాఖండ్​ కేదార్​నాథ్​

Uttarakhand Floods Today : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన వరదలు పెను ఉప్పెనను తలపిస్తున్నాయి. ప్రధాన నదులు ఉప్పొంగడం వల్ల వందలాది రోడ్లను అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. రిషికేశ్​లో గంగా మహోగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను అధికారులు 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు..

Uttarakhand Floods
Uttarakhand Floods
author img

By

Published : Aug 14, 2023, 5:54 PM IST

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు

Uttarakhand Floods Today : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజులుగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడం సహా పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. దెహ్రాదూన్‌, పౌరి, టెహ్రి, నైనితాల్‌, చంపావత్‌, ఉధం సింగ్‌ నగర్‌ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

చార్​ధామ్​ యాత్ర నిలిపివేత!
Chardham Yatra Suspended : చార్‌ధామ్‌ యాత్రను 2 రోజుల పాటు అధికారులు నిలిపివేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. దేవ్‌ప్రయాగ్‌, శ్రీనగర్‌లో గంగా, మందాకిని, అలక్‌నందా నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల జాతీయ రహదారులు మూసివేశారు.

కేదార్​నాథ్​ నడక మార్గం మూసివేత
Uttarakhand Rains 2023 : రుద్ర ప్రయాగ్‌లో కుంభవృష్టి కురిసింది. కొండ చరియలు విరిగిపడటం వల్ల కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లే నడక మార్గాన్నిఅధికారులు మూసివేశారు. బైరవ్‌ గదేరా, లించోలి మధ్య రహదారి కొట్టుకపోవడం వల్ల కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకపోయారు. బాన్స్వారా వద్ద రహదారి కోతకు గురవగా రుద్రప్రయాగ్‌-గౌరిఖుండ్‌ జాతీయ రహదారిని మూసివేశారు. బాన్స్వారా, బస్తీ వంతెనల వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండం వల్ల వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

కుప్పకూలిన డిఫెన్స్​ కాలేజీ..
Uttarakhand Rain Forecast : దెహ్రాదూన్‌లో డిఫెన్స్ కాలేజీ భవనం చూస్తూ ఉండగానే కుప్పకూలింది. ముందుగానే అందులోని విద్యార్థులు, సిబ్బంది.. భవనాన్ని ఖాళీ చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. స్థానిక వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల.. భవనం కింది మట్టి బురదమయమై ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలు స్తంభించాయి.

వరదనీటిలో కొట్టుకుపోయిన వాహనాలు..
Uttarakhand Rain News Today : చమోలీలో కుండపోతలకు దాదాపు జిల్లా అంతా జలదిగ్బంధంలో ఉంది. పలు చోట్ల వాగులు, వంకల ప్రవాహం ఉద్ధృతంగా మారడం వల్ల అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్​లో గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని దాటిన గంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక్కడే ఓ పవర్‌ ప్లాంట్‌లో పని చేసే కార్మికులు వరదల్లో చిక్కుకుపోగా వారిని సహాయక బృందాలు నదిపై తాడును వేలాడదీసి సురక్షితంగా కాపాడాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో వరదలకు 60మంది మరణించగా.. 17మంది గల్లంతయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై సీఎం పుష్కర్ సింగ్ ధామి జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మునిగిపోయే దశలో రిషికేశ్‌ శివుడి విగ్రహం
Uttarakhand Shiva Statue : రిషికేశ్‌లోని పరమార్థ్ నికేతన్ ఘాట్ వద్ద గంగా నదిలో ఉన్న ప్రసిద్ధ శివుడి విగ్రహం మునిగిపోయే దశలో ఉంది. గంగానది నీటిమట్టం పెరగడం వల్ల శివుడి విగ్రహం సగం నీట మునిగింది. 2013లో జరిగిన మహావిపత్తులో ఇలాంటి ఘటనే జరిగింది. త్రివేణి ఘాట్‌లోని హారతి స్థలం, సత్సంగ్‌ పండల్‌ పూర్తిగా నీట మునిగాయి. అటు.. శివపురి టన్నెల్‌ నిర్మాణ కార్మికులు 114 మంది.. సొరంగంలోనే చిక్కుకుపోయారు. సొరంగంలోకి వరదనీరు చేరడం వల్ల వారు ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు.

  • VIDEO | All 114 people stuck in Shivpuri tunnel, Tehri, Uttarakhand have been rescued. The tunnel was waterlogged due to heavy rainfall in the area.

    (Source: Third Party) pic.twitter.com/negZhBlkWj

    — Press Trust of India (@PTI_News) August 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.