Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించారు రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్ ధామి. 'లవ్ జిహాద్' చట్టాన్ని సవరించి 10ఏళ్లు కఠిన కారాగార శిక్షను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉత్తరాఖండ్‌ను ఆత్మనిర్భరత, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చారు.
రుణ మాఫీ, కనీస మద్దతు ధర అమలు..
Punjab assembly elections 2022: పంజాబ్‌లో రెండో మేనిఫెస్టోను సంయుక్తంగా విడుదల చేశాయి భాజాపా, కూటమి పార్టీలు. రైతులకు రుణమాఫీతోపాటు వ్యవసాయ బడ్జెట్లో రూ. 5వేలకోట్లు కేటాయిస్తామన్నాయి. ఈ మేనిఫెస్టోను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్) నేత దిండ్సా, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరిందర్ సింగ్ పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని కీలకాంశాలు:
BJP Punjab manifesto
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నూనె గింజలను ఉత్పత్తి చేసే రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అందిస్తాం.
- వ్యవసాయం అభివృద్ధికోసం వ్యవసాయ బడ్జెట్లో రూ. 5వేల కోట్లు కేటాయింపు
- ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు రుణ మాఫీ
- భూమిలేని రైతులకు లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు అందజేత
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి రూ. 6వేలు ఆర్థికసాయం
- ప్రతి పంచాయతీలో ఆరోగ్య కేంద్రాలు
- విద్యుత్తు వినియోగదారులకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం
- డిజిటల్ ఇండియా పథకం ద్వారా గ్రామాల్లో డిజిటల్ సేవలు
- ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, దివ్యాంగులకు 10వ తరగతి వరకు వార్షిక స్టైఫండ్ అందజేత
పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇవీ చూడండి:
పోలింగ్ ముంగిట.. పార్టీల 'నినాదాల పోరు'