ETV Bharat / bharat

జగన్​, కేసీఆర్​ ఫొటోలకు గంగానదిలో పుణ్యస్నానం - Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy.

వసంత పంచమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఉత్తరాఖండ్​ సీఎంల ఫొటోలకు హరిద్వార్​లోని గంగా నదిలో పుణ్య స్నానాలు చేయించారు ఓ భక్తుడు. తమ తమ రాష్ట్రాల్లో సుపరిపాలన అందించేలా చూడాలని ప్రార్థించారు.

Punnala Gaurishankar took ganga bath with 3 Chief Ministers
జగన్​, కేసీఆర్​ చిత్రపటాలకు గంగానదిలో పుణ్య స్నానం
author img

By

Published : Feb 16, 2021, 5:06 PM IST

Updated : Feb 16, 2021, 5:44 PM IST

సీఎంల ఫొటోలకు జలాభిషేకం

వసంత పంచమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​.. గంగా తీరానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ ఓ అరుదైన సన్నివేశం కనిపించింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన పున్నాల గౌరీశంకర్​ అనే ఓ భక్తుడు.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిత్రపటాలకు గంగా నదిలో పుణ్యస్నానాలు చేయించారు.

Punnala Gaurishankar took ganga bath with 3 Chief Ministers
తెలంగాణ సీఎం కేసీఆర్​ చిత్రపటానికి జలాభిషేకం

ఏపీ సీఎం జగన్​ చిత్రపటానికి జలాభిషేకం

ఉత్తరాఖండ్​, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సీఎంలు.. తమ రాష్ట్రాల్లో మంచి పాలన అందించేలా చూడాలని సరస్వతీ దేవికి పూజలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రికి పుణ్యస్నానం

''మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఉత్తరాఖండ్​ సీఎం, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​. జగన్మోహన్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావు చిత్రపటాలకు జలాభిషేకం చేశాను. స్వచ్ఛభారత్​లాగా వారి రాష్ట్రాల్లో స్వచ్ఛపాలన, సుపరిపాలన అందించాలని గంగా నదిలో పుణ్యస్నానం చేయించా. ఈ వసంత పంచమి రోజు.. వారికి జ్ఞానం ప్రాప్తించాలని కోరుకుంటున్నా.''

- పున్నాల గౌరీ శంకర్​, ఆంధ్రప్రదేశ్​కు చెందిన భక్తుడు

ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని.. పేదలు మరింత పేదవారిగా, ధనికులు ఇంకా సంపన్నులుగా మారుతున్నారని గౌరీ శంకర్​ అన్నారు.

కేసీఆర్​ చిత్రపటానికి పుణ్యస్నానం చేయిస్తున్న భక్తుడు

ఇదీ చూడండి: దీదీ దూత X మోదీ పరా: యాప్​లతో ఓట్ల వేట!

Last Updated : Feb 16, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.