ETV Bharat / bharat

10 రోజుల్లో 1000 మంది పిల్లలకు కరోనా! - కరోనాతో 10రోజుల్లో 1000 మంది చిన్నారులకు కరోనా

ఉత్తరాఖండ్​లో గడిచిన 10 రోజుల్లో 1000 మంది 9 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా సోకింది. మొత్తంగా మే 1 నుంచి 14వ తేదీ వరకు 1600లకు పైగా మంది చిన్నారులు కోవిడ్​ బారినపడ్డారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

children
కరోనా
author img

By

Published : May 16, 2021, 3:47 PM IST

ఉత్తరాఖండ్​లో కరోనా మహమ్మారి పిల్లల్లో వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన పదిరోజుల్లోనే 1000 మంది తొమ్మిదేళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడ్డారు. గత సంవత్సరం మొత్తం 2,131మంది పిల్లలకు కరోనా సోకగా ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా ఉందని ప్రభుత్వం తెలిపింది. కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత.. ఏప్రిల్ ​1 నుంచి 15వ తేదీ వరకు 264 మంది పిల్లలకు కరోనా సోకింది. ఏప్రిల్​ 16 నుంచి 30వరకు 1,053మంది చిన్నారులకు వైరస్​ పాజిటివ్​గా తేలింది. మే 1 నుంచి 14 వరకు 1,618 మంది పిల్లలు కొవిడ్​ బారిన పడ్డారు.

రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 771 కరోనా కేసులు నమోదవుతున్నాయని సోషల్​ డెవలప్​మెంట్​ ఫర్ కమ్యూనిటీస్​ ఫౌండేషన్​(ఎస్​డీసీఎఫ్​) అధ్యక్షుడు అనూప్​ నైనిటాల్​ తెలిపారు. అది ఉత్తర్​ప్రదేశ్​తో పోల్చుకుంటే ఏడు రెట్లు అధికమని అన్నారు. కరోనా పరీక్షల్ని చేయడంలో, మరణాల సంఖ్య తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 79,379 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 4,426మంది కరోనా వల్ల మృతి చెందారు.

ఇదీ చదవండి: 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.