ETV Bharat / bharat

గణతంత్ర పరేడ్​లో అయోధ్య రామమందిర శకటం

జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు.

Uttar Pradesh's Republic Day 2021 tableaux to showcase Ayodhya Ram Temple
గణతంత్ర పరేడ్​లో అయోధ్య రామమందిర శకటం
author img

By

Published : Dec 12, 2020, 3:23 PM IST

Updated : Dec 12, 2020, 3:45 PM IST

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు. 'అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్' పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యూపీ ప్రభుత్వం పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు పేర్కొంది. 'సర్వ ధర్మ సమాభావ్‌' థీమ్‌తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.

2017లో యూపీలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయోధ్యలో ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ నదీ తీరాన 'దీపోత్సవ్‌' కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగింది. దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా లభించింది.

ఇదీ చూడండి: పాసింగ్​ ఔట్​ పరేడ్​లో సైనికుల ఆనందోత్సాహం​

Last Updated : Dec 12, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.