5 states exit polls 2022: మినీ సార్వత్రికంలో విజేతలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారం భాజపాదేనని తేల్చాయి. మునుపటితో పోల్చితే సీట్లు తగ్గినప్పటికీ ఆ రాష్ట్రంలో కమలదళానికి మెజారిటీకి మించి సీట్లు వస్తాయని తెలిపాయి.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ పేర్కొన్నాయి. మణిపుర్లో భాజపా అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఉత్తరాఖండ్‌లో హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు, గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పోల్స్ అంచనా వేశాయి.
ఏ రాష్ట్రంలో ఎలా...
ఉత్తర్‌ప్రదేశ్- విజేత భాజపా
మ్యాట్రైజ్ పోల్ ప్రకారం యూపీలో భాజపాకు 262 నుంచి 277 సీట్లు రానున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి 119 నుంచి 134 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీకి 7-15, కాంగ్రెస్‌కు 3-8 వరకు రానున్నట్లు పోల్స్‌లో వెల్లడైంది.
పీ-మార్క్ ప్రకారం యూపీలో భాజపాకు 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్‌కు 4 స్థానాలు రానున్నాయి. ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని పీ-మార్క్ పోల్ అంచనా వేసింది.
మొత్తం సీట్లు- 403 (202 మెజారిటీ)
ఎగ్జిట్ పోల్స్ | భాజపా+ | ఎస్పీ | కాంగ్రెస్ | బీఎస్పీ |
ఈటీజీ రీసెర్చ్ | 230-245 | 150-165 | 2-6 | 5-10 |
న్యూస్18 పంజాబ్- పీ మార్క్ | 240 | 140 | 4 | 17 |
ఇండియా న్యూస్ | 222-260 | 135-165 | 1-3 | 4-9 |
న్యూస్ఎక్స్- పోల్‌స్ట్రాట్ | 211-225 | 146-160 | 4-6 | 14-24 |
పంజాబ్- విజేత ఆమ్ ఆద్మీ
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ప్రభంజనం సృష్టించనుందని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో మెజారిటీకి 59 స్థానాలు అవసరం కాగా.. ఆప్ అంతకుముంచి సీట్లను గెలుచుకోనుందని పోల్స్ పేర్కొన్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఉంది. భాజపాకు కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మొత్తం సీట్లు- 117 (59 మెజారిటీ)
ఎగ్జిట్ పోల్స్ | కాంగ్రెస్ | ఆప్ | భాజపా+ | అకాళీదళ్ |
ఇండియా టుడే | 19-31 | 76-90 | 1-4 | 7-11 |
ఈటీజీ రీసెర్చ్ | 27-33 | 70-75 | 3-7 | 7-13 |
రిపబ్లిక్ టీవీ | 23-31 | 62-70 | 1-3 | 16-24 |
న్యూస్ఎక్స్-పోల్‌స్ట్రాట్ | 24-29 | 56-61 | 1-6 | 22-26 |
ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ!
మరోవైపు, ఉత్తరాఖండ్‌లో భాజపా-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఏబీపీ-సీఓటర్ అంచనాల ప్రకారం భాజపాకు 26-32 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్‌కు 32 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి 36 స్థానాలు అవసరం.
టైమ్స్ నౌ- వీటో అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్‌లో భాజపాకు 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకోనుంది.
మొత్తం సీట్లు- 70 (36 మెజారిటీ)
ఎగ్జిట్ పోల్స్ | భాజపా | కాంగ్రెస్ | ఆప్ |
ఏబీపీ న్యూస్-సీఓటర్ | 26-32 | 32-38 | 0-2 |
ఈటీజీ రీసెర్చ్ | 37-40 | 29-32 | 0-1 |
న్యూస్24 | 43 | 24 | 0 |
న్యూస్ఎక్స్-పోల్‌స్ట్రాట్ | 31-33 | 33-35 | 0-3 |
రిపబ్లిక్ టీవీ | 35-39 | 28-34 | 0-3 |
టైమ్స్‌నౌ-వీటో | 37 | 31 | 1 |
జీ న్యూస్-డిజైన్‌బాక్స్డ్ | 26-30 | 35-40 | 0 |
గోవా
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గోవాలో హంగ్ ఏర్పడనుంది. ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది.
మొత్తం సీట్లు- 40 (21 మెజారిటీ)
ఎగ్జిట్ పోల్స్ | భాజపా | కాంగ్రెస్ | టీఎంసీ |
ఈటీజీ రీసెర్చ్ | 17-20 | 15-17 | 3-4 |
ఇండియా న్యూస్ | 13-19 | 14-19 | 3-5 |
ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో | 10-14 | 20-25 | 3-5 |
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ | 16-22 | 11-17 | 1-2 |
టైమ్స్‌నౌ-వీటో | 14 | 16 | 0 |
జీ న్యూస్-డిజైన్‌బాక్స్డ్ | 13-18 | 14-19 | 2-5 |
మణిపుర్
మణిపుర్లో భాజపా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌తో పోలిస్తే అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.
మొత్తం సీట్లు- 60 (31 మెజారిటీ)
ఎగ్జిట్ పోల్స్ | భాజపా | కాంగ్రెస్ |
ఇండియా న్యూస్ | 23-28 | 10-14 |
ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో | 26-31 | 12-17 |
న్యూస్18 పంజాబ్-పీ మార్క్ | 27-31 | 11-17 |
జీ న్యూస్-డిజైన్‌బాక్స్డ్ | 32-38 | 12-17 |
ఇదీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికపై.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఎంత?