ETV Bharat / bharat

వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్​లో విగతజీవిగా మరొకరు! - dalit girl suicide

Dalit Girl Cummits Suicide: ఓ యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది దళిత విద్యార్థిని. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది. ఓ ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​ లోపల 12వ తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించిన ఘటన తమిళనాడులో జరిగింది.

Upset over repeated molestation Dalit girl student cummits suicide in Pilibhit

author img

By

Published : Jul 25, 2022, 2:22 PM IST

Dalit Girl Cummits Suicide: ఓ యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురైన దళిత విద్యార్థిని.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​లో జరిగింది. సున్​గఢీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత బాలిక చనిపోయినట్లు తెలుస్తోంది. ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

21 ఏళ్ల ఓ యువకుడు.. తమ కుమార్తెను పలుమార్లు వేధించాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని హెచ్చరించినా వినలేదని చెప్పారు. నిత్యం చేసే వేధింపులు భరించలేకే మనస్తాపంతో తమ కుమార్తె ఆత్మహత్య​ చేసుకుందని వాపోయారు. మరోవైపు.. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే నిందితులను పట్టుకుంటామని వివరించారు.

హాస్టల్​లో శవమై కనిపించిన విద్యార్థిని.. ఓ ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​ లోపల 12వ తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. తమిళనాడు తిరువల్లూర్​ జిల్లా కిలాచెరిలో ఈ ఘటన జరిగింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు టెక్కలూర్​ వద్ద ధర్నాకు దిగారు.

A class 12 student found dead inside the hostel of a private school
భారీగా మోహరించిన పోలీసులు
A class 12 student found dead inside the hostel of a private school
బాధితురాలి కుటుంబసభ్యుల ఆందోళన

ఇవీ చూడండి: మద్యపానానికి బదులు.. గంజాయిని ప్రోత్సహించాలి: భాజపా ఎమ్మెల్యే

చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.