ETV Bharat / bharat

భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం - uttarpradesh gang rape case

తెలిసినవారే కదా అని నమ్మి వచ్చిన ఓ మహిళపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు ఐదుగురు యువకులు. బెదిరింపులకు బయపడి ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. ఆఖరికి ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. దీంతో అసలు విషయం బయటపడింది.

Woman gang raped by five in Barabanki
Woman gang raped by five in Barabanki
author img

By

Published : Sep 25, 2022, 11:40 AM IST

ఉత్తరప్రదేశ్​లోని బరాబంకీ జిల్లాలో ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబర్​ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది: పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బదోస్​రాయ్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు స్థానిక యువకుడు మొబైల్​ ఫోన్​ ఇచ్చాడు. అప్పటినుంచి తరచూ ఆమె ఆ యువకుడితో ఫోన్​లో మాట్లాడుతూ ఉండేది. సెప్టెంబర్​ 17న ఆ యువకుడు మహిళ ఇంటికి వచ్చాడు. భర్త పిలుస్తున్నాడని మహిళకు అబద్ధం చెప్పి.. ఆమెను వెంట తీసుకెళ్లాడు.

గ్రామ శివారుకు వెళ్లాక ఆ యువకుడితో పాటు మరో నలుగురు యువకులు ఉన్నారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ వచ్చిన బాధితురాలు ఇంటి చేరుకుంది. మొదట ఈ ఘటన గురించి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. సెప్టెంబర్​ 23న పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసును పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త ఇంటిపై పెట్రోల్​ బాంబ్ దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.