ETV Bharat / bharat

ఇన్​స్టాగ్రామ్​లో స్నేహం.. రూ. 32 లక్షలు మోసం

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమయ్యాడు. బ్రిటన్​ నుంచి మెసేజ్​ చేస్తున్నానని నమ్మించాడు. 'నీ కోసమే దిల్లీకి విలువైన కానుకను పంపిస్తున్నా,' అని ఆ మహిళకు చెప్పాడు. కానుకను తీసుకోవడం కోసం ముందు డబ్బు పెట్టాలని మరొకరు ఫోన్​ చేశారు. ఇదంతా నమ్మిన ఆ మహిళకు రూ. 32లక్షలు పోగొట్టుకునేంత వరకు అసలు విషయం అర్థంకాలేదు. చివరికి తాను మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది.

online fraud
ఆన్​లైన్​ మోసాలు
author img

By

Published : Oct 7, 2021, 10:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీకి చెందిన ఓ మహిళకు ఇన్​స్టాగ్రామ్​లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి తనని తాను బ్రిటన్​ నివాసితుడిగా పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల స్నేహం తర్వాత.. బ్రిటన్​ నుంచి ఓ విలువైన కానుక, కొంత నగదు పంపుతానని ఆ మహిళను నమ్మించాడు.

కొన్ని రోజుల తర్వాత మరో మహిళ నుంచి ఆ రాయ్​బరేలీ వాసికి వాట్సాప్​ ఫోన్​ వచ్చింది. 'మీ కోసం దిల్లీలో విలువైన కానుక, బ్రిటన్​ కరెన్సీలో రూ. 45లక్షలు వేచిచూస్తున్నాయి. వాటిని మీరు తీసుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలి. ఇన్​స్టాల్మెంట్​లోనైనా చెల్లించవచ్చు,' అని చెప్పింది. అది నమ్మిన ఆ మహిళ.. అలా రూ. 32లక్షలు చెల్లించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి, మహిళతో ఆమెకు సంబంధం తెగిపోయింది. ఆ నెంబర్లకు ఎన్నిసార్లు కాల్​ చేసినా ఎవరూ స్పందించలేదు.

ఇక ఆమె స్వయంగా దిల్లీకి వెళ్లి 'కానుక' గురించి వాకబు చేసింది. చివరికి తాను మోసపోయినట్టు అర్థం చేసుకుంది. రాయ్​బరేలీకి తిరిగివెళ్లి, పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

'ఇలా చేయకండి..'

ఆన్​లైన్​ ఆఫర్ల వలల్లో చిక్కుకోవద్దు అని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగదుకు సంబంధించిన విషయంలో ఎవరితో లావాదేవీలు జరుపుతున్నారో స్పష్టంగా తెలుసుకోవాలని తెలిపారు. సైబర్​ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయని, నిత్యం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఆన్​లైన్​ మోసాల ఫిర్యాదుల కోసం 155260 అనే హెల్ప్​లైన్​ను ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. సెప్టెంబర్​ నాటికి రాష్ట్రప్రజలు మోసపోయిన దాదాపు రూ. 2కోట్లు పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. మరో ఐదు కోట్లకు చెందిన లావాదేవీలను జప్తు చేశారు. ఆన్​లైన్​ మోసాలపై ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న డబ్బును అంత త్వరగా వెనక్కి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు పోలీసులు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.