కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి వయోజనులందరికీ(18ఏళ్లు దాటిన) ఉచితంగా కొవిడ్ టీకా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. ఈ నిర్ణయం తీసుకుంది.
"కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాని నిర్ణయం ఉపకరిస్తుంది. భారీ వ్యాక్సినేషన్ ద్వారా వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా అందించాలని నిర్ణయించాం. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తాం."
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఈ క్రమంలో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి: ఆక్సిజన్ ప్లాంట్లకు సాయుధ బలగాల రక్షణ