ETV Bharat / bharat

గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా? - భాజపా గోవులు

ఐదేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి- ‘గో సంరక్షణ’. అధికార పీఠమెక్కాక సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు తగ్గట్లు పలు చర్యలు చేపట్టింది. అక్రమ వధశాలలపై ఉక్కుపాదం మోపింది. భారీగా గోశాలలను నెలకొల్పింది. కానీ వాటి నిర్వహణలో లోపాలు యోగి సర్కారుకు తాజా ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వట్టిపోయిన ఆవుల సంఖ్య భారీగా పెరిగి, అవి యథేచ్ఛగా సంచరిస్తుండటంతో రైతులు, మరికొన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుండటమే అందుకు కారణం.

bjp cow
గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?
author img

By

Published : Feb 16, 2022, 7:31 AM IST

UP Polls: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోవులను పూజిస్తారు. ఆ విషయం రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలిసిందే! గోరఖ్‌పుర్‌లోని గోరక్షా పీఠానికి ఆయన అధిపతి. అయితే ఆవులను యోగి ఎంతగా ఆరాధిస్తారన్న సంగతి 2018 డిసెంబరులో దాదాపుగా దేశమంతటికీ తెలిసొచ్చింది. యూపీలో బులంద్‌శహర్‌ జిల్లాలోని ఓ నిర్జన ప్రదేశంలో గో కళేబరాలు కనిపించినప్పుడు.. దాదాపు 400 మందితో కూడిన ఓ సమూహం ఆగ్రహంతో ఊగిపోయింది. అక్కడికి సమీపంలోని చిగ్రావతి గ్రామంలో 2018 డిసెంబరు 3న విధ్వంసం సృష్టించింది. ఊర్లో ఉన్న ప్రతి ముస్లిం వ్యక్తి ఇంటిపై దాడి చేసింది. ఆ హింసను నిలువరించేందుకు ప్రయత్నించిన ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ సింగ్‌.. ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే- ఆయన హత్య కేసులో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. గోవధకు పాల్పడిన ఐదుగుర్ని మాత్రం అక్కడ అరెస్టు చేశారు. ఆ ఐదుగురు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. నాటి వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పోలీసు అధికారి హత్య కంటే గో వధే ఎక్కువ ముఖ్యమైన అంశంగా మారిందా?’’ అంటూ యోగి సర్కారుపై బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీగా గోశాలలు

ఆవుల సంరక్షణ కోసం రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ‘గోవధ నిరోధక చట్టం(యూపీ)- 1955’ను కఠినంగా అమలుచేస్తోంది. అనుమతుల్లేని వధశాలలను మూసివేసింది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5,664 గోశాలలను స్థాపించింది. 3,458 మేత కేంద్రాలను ఏర్పాటుచేసింది. వట్టిపోయిన గోవుల సంరక్షణ కోసం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.78.5 కోట్లు కేటాయించగా, 2021-22లో ఆ నిధులను రూ.425 కోట్లకు పెంచింది.

UP Assembly Polls 2022

యథేచ్ఛగా వదిలేస్తుండటంతో..

వట్టిపోయిన ఆవులను గతంలో రైతులు పశు వర్తకులకు విక్రయించేవారు. యోగి సర్కారు వ్యవసాయేతర అవసరాల కోసం గోవులను విక్రయించడాన్ని నిషేధించింది. ఫలితంగా పోషణ భారమై.. వాటిని అన్నదాతలు వీధుల్లో వదిలేస్తున్నారు. వాటి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా చిత్రకూట్‌, మహోబా, గోండా, హర్దోయీ, బాండా జిల్లాల్లో ఇలాంటి ఆవుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. అవి రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పొలాలపై పడి మేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వాటి బెడదను తప్పించుకునేందుకు రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో హిందూ వర్గానికి చెందిన రైతుల్లోనూ ‘గోమాత’పై ఆరాధనాభావం తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు వారు గోవులను కొట్టి తరిమేస్తున్న ఘటనలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ‘‘ఓ సామాజికవర్గ ప్రజల ఆహార అలవాట్లు మా పంటల రక్షణకు దోహదపడతాయంటే.. మాకు దానితో ఇబ్బందేమీ లేదు’’ అని నైమిశరణ్‌కు చెందిన రైతు అజయబ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ దఫా ఎన్నికలను తాము మత ప్రాతిపదికన కాకుండా.. ఆర్థికాంశాల కోణంలోనే చూస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని, వధశాలలు మళ్లీ తెరచుకుంటాయని ప్రతాప్‌యాదవ్‌ అనే వ్యక్తి ఆశాభావం వ్యక్తం చేశారు. గోవధపై నిషేధంతో తోళ్ల పరిశ్రమకు ముడిసరకు కొరత ఏర్పడుతోంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 10%గా ఉన్న జాతవ్‌లు ఎక్కువగా ఈ పరిశ్రమలోనే ఉపాధి పొందుతున్నారు.

ప్రభుత్వ సాయం పెంచాలని డిమాండ్‌

ఇప్పటికీ రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు..గోవులను కొట్టడాన్ని ‘పాపం’గానే పరిగణిస్తున్నారు. అయితే- గోవధ విషయంలో కఠిన నిబంధనలకు ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం మేలని వారు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ఆవులను రైతులు చితకబాదే ఘటనలు తగ్గుముఖం పడతాయని సూచిస్తున్నారు. మరోవైపు- వట్టిపోయిన ఆవులను వధశాలలకు పంపడమొక్కటే మార్గంగా తాము భావించడం లేదని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పోషణకు ఒక్కో పశువు కోసం రోజుకు కేవలం రూ.30 చొప్పున రైతులకు అందిస్తోందని.. దాన్ని రూ.150కి పెంచాలని బారాబాంకీలోని గంగౌర్‌ చౌధరీ అనే రైతు డిమాండ్‌ చేశారు.

bjp cow
గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?

సర్కారు దిద్దుబాటు చర్యలు

వట్టిపోయిన గోవుల వ్యవహారంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుండటాన్ని గుర్తించిన యోగి ప్రభుత్వం.. 2019 జనవరి నుంచి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. గో సంరక్షణ సుంకం పేరుతో.. ఆల్కహాల్‌పై, టోల్‌ప్లాజాల నుంచి 0.5% పన్ను వసూలు చేస్తోంది. మండీ పరిషద్‌ల నుంచి ఇప్పటికే వసూలు చేస్తున్న 1% గో రక్ష సుంకాన్ని 2%కు పెంచింది. తద్వారా వచ్చిన ఆదాయాన్ని గోశాలలకు కేటాయిస్తోంది. గ్రామాల్లో యథేచ్ఛగా తిరుగుతున్న పశువులను బంధించి సంరక్షణ కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని గత ఏడాది నవంబరు నుంచి ముమ్మరం చేసింది. అయితే- సంరక్షణ కేంద్రాల నిర్వహణ బాగా లేదని.. మేత సరిపోక చాలా పశువులను నిర్వాహకులు తిరిగి రోడ్లపైకి వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో గోవుల వ్యవహారం భాజపాకు ప్రతికూలాంశంగా పరిణమించొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇదీ చదవండి: 'మహా సర్కారును కూల్చేందుకు భాజపా కుట్ర.. ఈడీతో ఒత్తిడి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.