ETV Bharat / bharat

కాంగ్రెస్​లో తండ్రి.. ప్రత్యర్థి పార్టీలోకి కుమారుడు.. ఎన్​డీఏ తొలి ముస్లిం అభ్యర్థిగా రికార్డ్​!

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. తండ్రీకొడుకులకు ఒకే జిల్లాలో టికెట్​ కేటాయించింది కాంగ్రెస్​. తండ్రి పార్టీతోనే ఉండగా.. ఆయన కుమారుడు మాత్రం ఎన్​డీఏ భాగస్వామ్యపక్షం అప్నాదళ్​(ఎస్​)లోకి జంపయ్యారు. కాంగ్రెస్​ కేటాయించిన స్థానం నుంచే బరిలోకి దిగుతూ.. ఎన్​డీఏ తొలి ముస్లిం అభ్యర్థిగా నిలిచారు. ఆయనే.. కాంగ్రెస్​ సీనియర్​ నేత నవాబ్​ కజిమ్​ అలీ ఖాన్​ కుమారుడు హైదర్​ అలీ ఖాన్​.

NDA Muslim candidate
హైదర్​ అలీ ఖాన్​
author img

By

Published : Jan 24, 2022, 3:36 PM IST

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్​ దక్కని వారే కాదు.. కొందరు టికెట్​ దక్కినా పార్టీ మారుతున్న సందర్భాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి ఆసక్తికర సంఘటనే కాంగ్రెస్​, ఎన్​డీఏ మధ్య జరిగింది. రెండు వారాల క్రితమే రామ్​పుర్​ జిల్లాలోని సువార్​​ అసెంబ్లీ నియోజకర్గం టికెట్​ను హైదర్​ అలీ ఖాన్​కు కేటాయించింది కాంగ్రెస్​. ఇప్పుడు అదే అభ్యర్థిని అదే నియోజకవర్గం నుంచి పోటీలో నిలుపుతున్నట్లు భాజపా మిత్రపక్షం అప్నాదళ్​(సోనెలాల్​) ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టికెట్​ దక్కినప్పటికీ హస్తం పార్టీకి స్వస్తి చెప్పిన హైదర్​ అలీ ఖాన్​ అప్నాదళ్​లో చేరారు. దీంతో 2014 తర్వాత ఎన్​డీఏ తరఫున బరిలో దిగుతున్న తొలి ముస్లిం అభ్యర్థిగా నిలిచారు. కాంగ్రెస్​ టికెట్​పై పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, అందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పుకొచ్చారు.

" అప్నాదళ్​(ఎస్​)లో చేరాను. ఇప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధికి భరోసా ఇవ్వగలను. నా పార్టీ నేత అనుప్రియా పటేల్​ పోరాటమే నాకు స్ఫూర్తి. గడిచిన ఐదేళ్లలో యూపీ ప్రభుత్వం ఎన్నో చేసింది. ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా అంశాలు నన్ను ప్రభావితం చేశాయి. "

- హైదర్​ అలీ ఖాన్​.

కాంగ్రెస్​లోనే ఖాన్​ తండ్రి..

హైదర్​ అలీ ఖాన్​ తండ్రి నవాబ్​ కాజిబ్​ అలీ ఖాన్​ ప్రస్తుతం కాంగ్రెస్​లోనే కొనసాగుతున్నారు. రామ్​పుర్​ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్​, ఎన్​డీఏ మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కుమారుడు పార్టీ మారడంపై విలేకరులు ప్రశ్నించగా.. 'రామ్​పుర్​ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థిని నేనే. పార్టీని వీడాలనే ఆలోచనే లేదు.' అని పేర్కొన్నారు హైదర్​ అలీ ఖాన్​ తండ్రి నవాబ్​ కజిమ్​ అలీ ఖాన్​.

అభ్యర్థుల జాబితా ప్రకటించి.. టికెట్​ ఖరారు చేసిన తర్వాత కాంగ్రెస్​ను వీడిన వారిలో హైదర్​ అలీ ఖాన్​ రెండో వ్యక్తి. ఆయన కన్నా ముందే బరేలీ కంటోన్మెట్​ అభ్యర్థి సుప్రియా అరోన్​ కాంగ్రెస్​ను వీడి సమాజ్​వాదీ పార్టీలో చేరారు.

అప్నాదళ్​(ఎస్​) కీలక ప్రకటన..

సువార్​ అసెంబ్లీ స్థానం నుంచే హైదర్​ అలీ ఖాన్​ను బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు అప్నాదళ్​(ఎస్​) జాతీయ అధికార ప్రతినిధి రాజేశ్​ పటేల్​.

" పార్టీ నాయకత్వాన్ని మెప్పించిన హైదర్​ అలీ ఖాన్​.. కొద్ది రోజుల క్రితమే దిల్లీలో పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అయితే.. సువార్​ నియోజకవర్గ అభ్యర్థిగా హైదర్​ను ప్రకటించింది కాంగ్రెస్​. అప్నాదళ్​(ఎస్​)లో చేరిన క్రమంలో అదే స్థానంలో హైదర్​ను పోటీలో నిలబెడుతున్నాం. "

- రాజేశ్​ పటేల్​, అప్నాదళ్​(ఎస్​), జాతీయ అధికార ప్రతినిధి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ సీనియర్​ నేత, రామ్​పుర్​ ఎంపీ అజామ్​ ఖాన్​ కుమారుడు అబ్దుల్లా అజామ్​ ఖాన్​ పోటీ చేసి గెలుపొందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు నేతల మొండిచెయ్యి.. టికెట్ ఇచ్చినా పార్టీ నుంచి జంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.