వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్లో(up assembly election 2022) మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది భాజపా. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల బాధ్యతలను కేంద్రం హోంమంత్రి, వ్యూహరచనలో చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా(Amit Shah news) తీసుకున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు 'షా హై తో రా హై'(అమిత్ షా ఉంటే మార్గమున్నట్లే) అనే నినాదంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం(uttar pradesh election 2022) అమిత్ షా సిద్ధం చేసిన మెగా ప్లాన్ను భాజపా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం పార్టీ ఏర్పాటు చేసిన బృందాలన్నీ ఎన్నికల ప్రచారం ఒక్కో విడత తర్వాత నివేదికను షాకు అందిస్తాయి. దీనికి అనుగుణంగా ఎన్నికల అజెండా, వ్యూహాలను ప్రతి విడత తర్వాత మార్చుతూ భాజపా ప్రచారంలో(bjp up election 2022) ముందుకు సాగుతుంది. ఈ వ్యూహాలు, అజెండాను పార్టీ ప్రచార కమిటీ, ఐటీ సెల్ సిద్ధం చేస్తాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి.
దీపావళి తర్వాత ఈ మెగా ప్లాన్ను ఉత్తర్ప్రదేశ్ వ్యాప్తంగా(bjp uttar pradesh news ) పూర్తి స్థాయిలో అమలు చేస్తామని భాజపా వర్గాలు తెలిపాయి. ఉత్తర్ప్రదేశ్ ఓటర్ల నాడిని అమిత్ షా(amit shah news latest) పట్టుకున్నారని, భాజపాను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయనకంటే పెద్ద వ్యూహకర్త మరెవరూ లేరని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
ఇదీ చదవండి: 'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'