ETV Bharat / bharat

నా భర్త నన్ను కొడతారు.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు: యూపీ మంత్రి - యూపీ మంత్రి స్వాతి సింగ్

సొంత భర్తే తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మహిళా మంత్రి వాపోయింది. అయితే.. ఓ వ్యక్తితో ఫోన్​లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు మంత్రి స్వాతి సింగ్. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

UP minister Swati Singh
UP minister Swati Singh
author img

By

Published : Jan 25, 2022, 9:00 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా మంత్రి స్వాతి సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె భర్త తనను కొడతారంటూ ఓ వ్యక్తితో స్వాతి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

2017లో సరోజినీ నగర్​ అసెంబ్లీ సీటు నెగ్గి ఉత్తర్​ప్రదేశ్​ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎంపికయ్యారు స్వాతి సింగ్. అయితే.. ప్రస్తుతం ఆమె ఫోన్​ సంభాషణ నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. తన భర్త దయా శంకర్.. శారీరకంగా వేధించాడంటూ స్వాతి ఓ వ్యక్తితో ఫోన్​లో చెప్పారు. చాలా సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, దాడి చేశారని ఆరోపించారు.

అయితే.. ఈ విషయాన్ని ఎక్కడా చర్చించొద్దని ఫోన్​లో స్వాతి సింగ్​ కోరారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ ఆడియో లీకైంది. దీంతో మహిళా మంత్రి మరోసారి వార్తల్లో నిలిచారు.

మొదట్లో అలా..

2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు స్వాతి సింగ్ భర్త దయా శంకర్. అనంతరం నసీముద్దీన్ సిద్ధిఖీ ఆధ్వర్యంలో బీఎస్పీ నేతలు ధర్నాకు దిగారు. స్వాతి సింగ్​, ఆమె కూతురుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో స్వాతి సింగ్ వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం దయా శంకర్​ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని, టికెట్​ కోసం లాబీయింగ్​ చేస్తున్నారని సమాచారం.

ఇదీ చదవండి:

UP assembly elections : 159 మంది అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ

'సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్​ ప్రధాని లాబీయింగ్​!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.