ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు - ఆరేళ్ల బాలికపై అత్యాచారం

UP MINOR RAPE: ఉత్తర్​ప్రదేశ్​లో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునేందు వెళ్లగా.. వారిపై కాల్పులు జరిపాడు.

rape
రేప్
author img

By

Published : Mar 12, 2022, 6:49 PM IST

UP MINOR RAPE: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్​పీ రోహిత్​ సింగ్​ సజ్వాన్​ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

నోట్​ ప్యాడ్​ కొనుక్కోవాలని బాలిక శుక్రవారం మధ్యాహ్నం స్టేషనరీ షాప్​కు వెళ్లింది. ఎంతసేపు చూసినా సరే చిన్నారి తిరిగి రాలేదు. దీంతో బాలిక అమ్మమ్మ వెతుకులాట మొదలు పెట్టింది. ఈ క్రమంలో చిన్నారిని ఓ వ్యక్తి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు.

ఇదే సమయంలో బాలికకు రక్తస్రావం అయ్యింది. దీనిని గమనించిన ఆమె తండ్రి.. ఇజాత్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేశారు. బాలికను ఇంటి దగ్గర వదిలి వెళ్లిన అతనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ల్యాండింగ్​లో అపశృతి.. రన్​వే పైనుంచి పక్కకు జరిగిన విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.