ETV Bharat / bharat

100 మంది మహిళల్ని వేధించిన వ్యక్తి అరెస్ట్ - యూపీలో ఫోన్​లో మహిళలపై వేధింపులు

యూపీవ్యాప్తంగా మహిళలు, బాలికలపై ఫోన్​లో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నచ్చిన నంబర్​కు ఫోన్​ చేసి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఇప్పటికే అతడిపై 66 ఫిర్యాదులు అందగా, మరిన్ని నమోదయ్యే అవకాశముంది.

UP man held after 66 complaints of harassment by women
మహిళలపై వేధింపులు: 66 ఫిర్యాదుల తర్వాత నిందితుడు అరెస్టు
author img

By

Published : Mar 14, 2021, 4:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​వ్యాప్తంగా మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడిన రాకేశ్​ కుమార్​ అనే వ్యక్తిని 66 ఫిర్యాదుల తర్వాత ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. ఔరైయా జిల్లాకు చెందిన 51 ఏళ్ల నిందితుడి నుంచి రెండు సెల్​ఫోన్లు, పలు సిమ్​కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతడికి పెళ్లైన ముగ్గురు కొడుకులున్నారు.

నిందితుడిపై ఉమెన్ పవర్ ​లైన్​కు మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లాక్​మెయిలింగ్​కు భయపడి చాలామంది మహిళలు పోలీసులను ఆశ్రయించలేకపోతున్నారని సమాచారం.

"ఇష్టమొచ్చిన ఏదో ఒక ఫోన్​ నంబర్​కు నిందితుడు కాల్​ చేసేవాడని తెలుస్తోంది. అటువైపు ఎవరైనా మహిళలు గానీ, బాలికలు గానీ స్పందిస్తే వారి నంబర్​ను సేవ్​ చేసుకునేవాడు. తర్వాత వారికి పదేపదే ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం, సందేశాలు పంపడం, అశ్లీల పాటలు వినాలని బలవంతం లాంటివి చేసేవాడు. 100 మందికి పైగా ఆడవాళ్లతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. అతడి ఫోన్లో 200కు పైగా మహిళల ఫోన్​ నంబర్లున్నాయి. 2018 నుంచి నిందితుడు ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నాడు. తొలుత ఉమెన్ పవర్​ లైన్ కౌన్సెలింగ్ ఇచ్చినా అతడి వైఖరి మారలేదు."

- అపర్ణా గౌతమ్, ఔరైయా ఎస్పీ

నిందితుడిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కొట్టేసిన కార్డులతో రూ.2 కోట్ల ఆన్​లైన్​ షాపింగ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.