ETV Bharat / bharat

అత్యాచారానికి యత్నించి.. వేడి కత్తితో కళ్లపై కాల్చి... - rapist attack on womens eyes

మహిళపై అత్యాచారానికి యత్నించడమే కాదు.. ఆమెను శారీరకంగా చిత్రవధకు గురిచేశారు కొందరు కిరాతకులు. వేడి చేసిన కత్తితో ఆమె కళ్లపై కాల్చారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

eye burnt lady
మహిళ కళ్లుపై వేడి కత్తితో గాయపర్చిన దుండగులు
author img

By

Published : Jul 28, 2021, 12:10 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లలిత్​పుర్​ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై.. కొంతమంది కిరాతకులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో తన కళ్లపై కాల్చారు.

అసలేం జరిగింది?

లలిత్​పుర్ జిల్లాలోని బార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. మార్కెట్​కు వెళ్లి తిరిగి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్​ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు.

అయితే.. సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితులు.. లైటర్​ వెలిగించి, కత్తిని వేడి చేసి, మహిళ కళ్లపై కాల్చారు. ఆ బాధతో ఆమె రోదిస్తున్న క్రమంలో.. తీవ్రంగా కొట్టారని బాధితురాలు తెలిపింది. అనంతరం తాను స్పృహ కోల్పాయానని చెప్పింది.

మార్కెట్​కు వెళ్లిన మహిళ.. ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు తన కోసం వెతకటం ప్రారంభించారు. ఓ నిర్జన ప్రదేశంలో.. ఆ మహిళ స్పహ కోల్పోయి ఉండటం వారికి కనిపించింది. దాంతో వెంటనే వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి పక్కనే ఉండే ఈ నిందితులు.. తమ మరదలు, ఆమె భర్తను కూడా మూడు నెలల క్రితం ఇదే విధంగా వేధించారని బాధితురాలు చెప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

బాధితురాలి కుటుంబం తాజాగా చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని బార్​ పోలీస్ స్టేషన్ అధికారి అంజనీ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కూలీలు- ఒకరు మృతి

ఇదీ చూడండి: 'కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.