Up government for meritorious students: రాష్ట్రంలోని కోటి మంది గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు అందించే కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సెషన్లో ఇంటర్, మెట్రిక్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు, ట్యాబ్‌లు అందజేయాలని నిర్ణయించింది.
Cash tab prizes to inter students: రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి రూ.లక్ష నగదు, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు రూ.21,000 నగదు బహుమతిని ప్రభుత్వం అందించనుంది. నగదుతోపాటు వారికి ట్యాబ్‌లు కూడా ఇవ్వనుంది. త్వరలో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు ఈ బహుమతులు అందించనున్నారు.
వివిధ జిల్లాలకు చెందిన స్కూల్ ఇన్స్పెక్టర్లకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలను విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వినయ్ కుమార్ పాండే ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు.. మెరిట్ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
కరోనాతో బ్రేక్...
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ తరహా ప్రోత్సాహకాలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతంలోనూ ఇచ్చినప్పటికీ.. కరోనా ప్రభావంతో గతేడాది నిలిపివేసింది. అంతేగాకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధమైంది.
ఇదీ చూడండి: 'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'
ఇదీ చూడండి: ఆ లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్నాం: మోదీ