ఉత్తర్ప్రదేశ్లో మరో పాశవిక ఘటన వెలుగుచూసింది. మోన్పురి జల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
ఓ పోలీసు అధికారి తన మిత్రుడు.. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మహిళను అత్యాచారం చేశారు. ముందు ఇరువురూ కలిసి యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిని వదిలేసి పరారయ్యారు.
శనివారం తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కాస్గంజ్ జిల్లాలోని పాటియాలా ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ధర్మేంద్ర నిందితుల్లో ఒకడని తెలిపింది.
ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం