ETV Bharat / bharat

భర్తతో నిద్రిస్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్.. కత్తితో బెదిరించి..! - మైనర్​ బాలికపై సామూహిక అత్యాచారం

భర్తతో డాబాపై నిద్రపోతుండగా ఐదుగురు యువకులు కత్తితో బెదిరించి మైనర్​ భార్యపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ అల్వార్​లో జరిగింది. మరో ఘటనలో పదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Rape with fashion designer in Jaipur
Rape with fashion designer in Jaipur
author img

By

Published : Jun 20, 2022, 12:33 PM IST

మైనర్​ వివాహితపై ఐదుగురు దుండగులు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్​లోని అల్వార్​లో జరిగింది. ఈ ఘటన జూన్​ 12న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామగఢ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో జూన్ 12 రాత్రి ఇంటి మిద్దెపై పడుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలోనే పక్క డాబా పైన నిద్రిస్తున్న ఐదుగురు యువకులు అర్ధరాత్రి కత్తితో బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేశారు. వారి కదలికలతో భర్తకు మెలుకువ రావటం వల్ల నిందితులు గోడ దూకి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్య పరీక్షలు నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.

పదేళ్ల బాలికపై గ్యాంగ్​రేప్​: ఉత్తర్​ప్రదేశ్​ బిసల్​పుర్​లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై ముగ్గరు వ్యక్తులు కలిసి గ్యాంగ్​ రేప్​ చేశారు. ఈ ఘటన మే 15న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఖుర్జాల్​, జితేంద్ర, వీరేంద్ర అనే ముగ్గురు నిందితులు పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొదట కేసు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టించుకోలేదని బాలిక తల్లి వాపోయింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఫ్యాషన్​ డిజైనర్​పై అత్యాచారం: ఓ ఫ్యాషన్​ డిజైనర్​ను రేప్​ చేసిన ఘటన రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ జిల్లాకు చెందిన బాధితురాలు.. 2019 నుంచి జైపుర్​లో నివసిస్తోంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్​గా పనిచేస్తుండగా.. బట్టల దుకాణం నిర్వహించే జిశాన్ ఖాన్​ పరిచయం అయ్యాడు. వ్యాపారంలో సాయం చేస్తానంటూ బాధితురాలిని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. ఆపై అనేక సార్లు హోటళ్లలో ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే బాధితురాలు పెళ్లి చేసుకోమని కోరగా.. అతడు నిరాకరించాడు. పెళ్లికి బాధితురాలు పట్టుపట్టడం వల్ల ముంబయి వెళ్లిన నిందితుడు.. అక్కడ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు.. జిషాన్​ ఖాన్​కు ఫోన్​ చేయగా.. ఈ విషయం బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిందితుడిపై అత్యాచార సెక్షన్ల కింద కేసు పెట్టింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: స్కూటీతో సహా మ్యాన్​హోల్​లో పడిపోయిన దంపతులు.. క్షణాల్లో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.