ETV Bharat / bharat

యూపీలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై హిజ్రా అత్యాచారం - బరేలీ బాలికపై లైంగిక దాడి

UP Eunuch Rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది ఓ హిజ్రా అని పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు బాలిక కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హిజ్రా కోసం గాలిస్తున్నారు.

kinnar raped an innocent girl
kinnar raped an innocent girl
author img

By

Published : Apr 10, 2022, 10:48 AM IST

Updated : Apr 10, 2022, 11:21 AM IST

UP Eunuch Rape: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఓ హిజ్రా లైంగిక దాడి చేసిన ఘటన బరేలీలోని మిరాజ్​గంజ్ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను హిజ్రా బెదిరింపులకు గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే, హిజ్రా పరారీలో ఉన్నట్లు సమాచారం.

Eunuch Rape News: బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఫరీన్ అనే హిజ్రా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కింట్లో టీవీ చూస్తున్న సమయంలో బాలిక దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికపై హిజ్రా బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. మార్చి 29నే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాధితురాలు హిజ్రాకు భయపడి విషయం చెప్పలేదని తెలిపారు. అయితే, కడుపు నొప్పి అధికం కావడం వల్ల కుటుంబ సభ్యులకు జరిగిన ఘటన గురించి వివరించింది బాలిక. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హిజ్రాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

UP Budaun rape: మరోవైపు, బదాయూలో మైనర్​పై అత్యాచారం జరిగింది. ఇస్లామ్​నగర్​లో తొమ్మిదేళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి రేప్ చేశాడని పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని చెప్పారు. 'ఇంటి బయట బాలిక ఆడుకుంటుండగా రామ్​భరోస్ అనే వ్యక్తి వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది' అని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు.. భయంతో జనం పరుగులు

Last Updated : Apr 10, 2022, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.