ETV Bharat / bharat

60 గోమాతలు మృతి.. ఘటనపై యోగి సీరియస్​! - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్

UP Cow Death: ఉత్తర్​ప్రదేశ్​ అమరోహ జిల్లాలో 60 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక ఇవ్వాలని అదనపు చీఫ్​ సెక్రటరీని ఆదేశించారు.

cm yogi amroha cows death
cm yogi amroha cows death
author img

By

Published : Aug 5, 2022, 6:38 PM IST

UP Cow Death: ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహ్​ జిల్లాలో విషాహారం తిని 60 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక ఇవ్వాలని అదనపు చీఫ్​ సెక్రటరీని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అస్వస్థతకు గురైన గోవులకు సరైన వైద్యసదుపాయాలు అందించాలని సూచించారు.

మరోవైపు ఆవులకు పశుగ్రాసం కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్​ చేశారు జిల్లా కలెక్టర్​. మిగిలిన ఆవులకు ప్రస్తుతం చికిత్స అందుతోందని చెప్పారు. పశుగ్రాసంలో విష పదార్థాలు కలిపారా? అన్న కోణంలోను విచారిస్తామన్నారు. పశుగ్రాసాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి: 'పార్లమెంటుతో సంబంధం లేకుండా హాజరు కావాలి'.. ఖర్గేకు వెంకయ్య కౌంటర్​

నాలుగో అంతస్తు నుంచి కుమారుడ్ని తోసేసిన తల్లి.. 40 అడుగుల బావిలో నవజాత శిశువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.