ETV Bharat / bharat

'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​ - మతమార్పిళ్ల కోసం పెళ్లిళ్లు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం... బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు ఓ ఆర్డినెన్స్​ను ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్​ నాథ్​ సింగ్​ వెల్లడించారు.

UP Cabinet decides to introduce an ordinance against unlawful religious conversions: State Cabinet Minister Siddharth Nath Singh
'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​
author img

By

Published : Nov 24, 2020, 7:02 PM IST

Updated : Nov 24, 2020, 7:11 PM IST

ప్రేమ పెళ్లి కోసం మత మార్పిడికి పాల్పడే ఘటనలను నివారించేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్​కు రాష్ట్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది. ఆ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్​ నాథ్ సింగ్ ఈమేరకు​ వెల్లడించారు.

లవ్ జిహాద్​(ప్రేమ పేరిట మత మార్పిడికి పాల్పడటం)పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడానికి రెండు నెలల ముందు కాన్పుర్​లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు ఆర్డినెన్స్​ తీసుకురావాలని నిర్ణయించింది యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం.

కఠిన శిక్షలు...

  • బలవంతపు మతమార్పిళ్లు చేయించిన వారికి రూ. 15వేల జరిమానాతో పాటు 1-5ఏళ్లు జైలు శిక్ష.
  • ఎస్​సీ/ఎస్​టీ మైనర్లు, మహిళలతో మతమార్పిళ్లు చేయించినవారికి రూ. 25వేల పెనాల్టీతో పాటు 3-10ఏళ్ల జైలు శిక్ష.

ఇదీ చూడండి:- 'హిందువా.. ముస్లిమా అనవసరం- మేజర్లా.. కాదా?'

Last Updated : Nov 24, 2020, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.