ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యే ధీరజ్ ఓజా.. ప్రతాప్‌గఢ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హైరానా చేశారు. స్థానిక నాయకుల ఆదేశాలతో తన అనుచరుల పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రాణి నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే.. తన బట్టలను తానే చించుకొని జిల్లా ఎస్పీ తనను కొట్టారని ఆరోపించారు. రోడ్డుపైనే పడుకొని, ఎస్పీ తనను భయపెట్టాడని చెప్పుకొచ్చారు.
కాగా.. ఎమ్మెల్యే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ ఆకాశ్ కుమార్ చెప్పారు. జిల్లా కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ డ్రామాను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: మమత బెనర్జీకి ఈసీ నోటీసులు