ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (UP Election 2022) వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ఆ రాష్ట్రంలో (Amit Shah UP visit) పర్యటించనున్నారు. అక్టోబర్ 29న లఖ్‌నవూకు (Amit Shah UP Tour) వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ ఆఫీస్ బేరర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
యూపీ ఎన్నికల కోసం అమిత్ షా 'మెగా ప్లాన్'ను సిద్ధం చేశారని, లఖ్‌నవూ ఆఫీస్ బేరర్ల సమావేశంలో (UP news Amit Shah) దీని గురించి పార్టీ నేతలకు వివరిస్తారని భాజపా వర్గాలు (UP Elections BJP) వెల్లడించాయి. ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్‌కు ఓ బాధ్యత అప్పగిస్తారని తెలిపాయి. దీన్ని సాధించేందుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తారని వివరించాయి.
అమిత్ షా సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ భాజపా ఇంఛార్జ్ రాధామోహన్ సింగ్, ఎన్నికల ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, సహ ఇంఛార్జ్ అనురాగ్ ఠాకూర్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సహా ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
టార్గెట్ 350!
2022 ఎన్నికల్లో 350 సీట్లలో (UP BJP Seats) గెలుపే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. యూపీలోని కాశీ, గోరక్ష, అవధ్, కాన్పుర్, బుందెల్‌ఖండ్, బ్రజ్, పశ్చిమ్ ప్రాంతాలపై భాజపా ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ప్రాంతాల్లో పరిస్థితులను అనుక్షణం గమనిస్తోంది.
లఖింపుర్ ఖేరి ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున.. పార్టీ సైతం అప్రమత్తమైంది. ఘటనపై ఏ విధంగా స్పందించాలనే విషయంపై పార్టీ సంస్థాగత జిల్లాలకు బాధ్యత వహించే 98 మీడియా బృందాలకు సూచనలు జారీ చేసింది. విపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలని వారికి వివరించింది.
షా ఎందుకు?
అమిత్ షాను ఎన్నికల ప్రణాళికల్లో ఇప్పటి నుంచే భాగం చేయడం భాజపా వ్యూహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దిల్లీ పీఠానికి కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టుకోల్పోకూడదని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు.
"యూపీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. అత్యధిక లోక్‌సభ స్థానాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఎన్నికల సన్నద్ధతపై భాజపా అధిక శ్రద్ధ పెట్టింది. అమిత్ షా పర్యవేక్షణలో వీటిని నిర్వహించడానికి కారణం కూడా అదే. ఈ పార్టీ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూస్తే అర్థమవుతుంది. అమిత్ షా అనుభవం ఉన్న నాయకుడు. భాజపాకు అధ్యక్షుడిగా పనిచేశారు. ర్యాలీలు, రోడ్‌షోలకు భారీగా జనాన్ని ఆకర్షించే సత్తా ఆయనకు ఉంది. ఆ అనుభవాన్ని, చరిష్మాను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. అందుకే భాజపా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటికీ.. ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదే కాదు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ అమిత్ షాను పార్టీ ఉపయోగించుకుంది. ప్రస్తుతం భాజపా అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా సైతం క్రియాశీలంగానే ఉన్నారు."
-దేశ్ రతన్ నిగమ్, రాజకీయ విశ్లేషకుడు
భాజపా 350 సీట్లు గెలుస్తుందా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా సంస్థాగతంగా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి నుంచి కష్టపడితే 350 సీట్లు గెలిచే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు.
ఇదీ చదవండి: