ETV Bharat / bharat

UP assembly elections : 159 మంది అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ - అభ్యర్థుల ఎంపిక

UP assembly elections: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్​వాదీ పార్టీ. 159 మంది పేర్లను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, అజామ్​ ఖాన్​, నహిద్​ హసన్​ వంటి కీలక నేతలకు చోటు కల్పించింది.

Akhilesh yadav
అఖిలేశ్​ యాదవ్​
author img

By

Published : Jan 24, 2022, 10:17 PM IST

Updated : Jan 24, 2022, 10:28 PM IST

UP assembly elections: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీలు. తాజాగా 159 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది సమాజ్​వాదీ పార్టీ. ఎస్​పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​.. మెయిన్​పురి జిల్లాలోని కర్హాల్​ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే.. జైలుకు వెళ్లిన నేత అజామ్​ ఖాన్​ రామ్​పుర్​ నుంచి, పార్టీ ఎమ్మెల్యే నహిద్​ హసన్​ కైరాన్​ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇటీవల సమాజ్​వాదీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీకి సహరాన్​పుర్​ జిల్లాలోని సకుర్​ నియోజకవర్గాన్ని కేటాయించారు అఖిలేశ్​. అజామ్​ ఖాన్​ కుమారుడు అబ్దుల్లా అజామ్​కు సువార్​ తాండా టికెట్​ ఇచ్చారు. పార్టీ సీనియర్​ నేత శివపాల్​ యాదవ్​కు తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఇతవాహ్​ జిల్లాలోని జశ్వంత్​నగర్​ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు.

ఎస్​పీలోకి భాజపా ఉపాధ్యక్షుడి భార్య..

ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఉపాధ్యక్షుడిగా సేవలందించి 20 నెలల క్రితం మృతి చెందిన ఉపేంద్ర దత్​ శుక్లా భార్య శుభావతి శుక్లా సమాజ్​వాదీ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు సైతం ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై విమర్శలు చేసింది శుక్లా కుటుంబం. శుక్లా మరణించి 20 నెలలు గడుస్తున్నా కనీసం ఎలా ఉన్నారని కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు శుభావతి. భాజపా నుంచి ఏ ఒక్కరు తమను కలిసేందుకు రాలేదన్నారు. ఆ సమయంలో సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీలోని 403 నియోజకవర్గాలకు ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఉత్తరాఖండ్​లో కాంగ్రెస్​ రెండో జాబితా..

Uttarakhand assembly election 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 11 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​కు ఈ జాబితాలో చోటు కల్పించింది. ఆయన రామ్​నగర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే.. ఇటీవలే భాజపా నుంచి కాంగ్రెస్​లోకి తిరిగి వచ్చిన హారక్​ సింగ్ రావత్​ కోడలు.. అణుకృతి గుసేన్​ రావత్​కు లాన్స్​డౌన్​ సీటు కేటాయించింది. అయితే.. హారక్​ సింగ్​కు సీటు కేటాయించలేదు. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అందులో హారక్​ సింగ్​కు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా జాబితాతో మొత్తం 64 మంది పేర్లను ఖరారు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో తండ్రి.. ప్రత్యర్థి పార్టీలోకి కుమారుడు.. ఎన్​డీఏ తొలి ముస్లిం అభ్యర్థిగా రికార్డ్​!

Last Updated : Jan 24, 2022, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.