Unvaccinated Children: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. వ్యాక్సినేషన్‌పైనా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని పిల్లలను పాఠశాలలోకి అనుమతించబోమని ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా.. తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్.
హరియాణాలో మొత్తం 15 లక్షలకుపైగా అర్హులైన పిల్లలు టీకా తీసుకోవాల్సి ఉంది. వారంతా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని.. పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విజ్.
Bengal extends COVID-19 restrictions
బంగాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్-19 ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహాది శుభ కార్యక్రమాలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. పెళ్లిళ్లకు గరిష్ఠంగా 200 మంది హాజరుకావొచ్చని స్పష్టం చేసింది.
అసోంలో కఠిన ఆంక్షలు..
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోనివారు బయట తిరగొద్దని స్పష్టం చేసింది అసోం ప్రభుత్వం. జిల్లా కోర్టులు, హోటళ్లు, మార్కెట్లు వంటి ప్రదేశాల్లో వారికి అనుమతి ఉండదని తేల్చిచెప్పింది.
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని, మాస్కు మాత్రం తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
JK Weekend Restrictions
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. వారాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. మార్కెట్లను మూసివేయించి.. వ్యాపారులను ఇళ్లకు పంపించారు అధికారులు. మరోవైపు.. విద్యా సంస్థలు ఆన్లైన్లోనే బోధన సాగించాలని సూచించింది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం.
జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం రికార్డు స్థాయిలో 2,456 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,52,623కు చేరింది. మరణాలు 4,557గా ఉన్నాయి.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 2,68,833 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Covid-19 Vaccination: దేశంలో 2021 జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్ డోసులను అందిస్తుండగా.. భారత్ కూడా ప్రికాషన్ డోసులను వడివడిగా వేస్తోంది.
భారత్‌లో ఇప్పటివరకు 155 కోట్లకుపైగా టీకా డోసులను లబ్ధిదారులకు అందించింది కేంద్రం.
ఇవీ చూడండి: వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?