దేశంలో గత పదేళ్లలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీల సంఖ్య రెట్టింపైనట్టు అసోసియేషన్ ఫర్ డెెెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదికలో తెలిపింది. కొత్తగా నమోదైనవి, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందడానికి తగినంత ఓట్ల శాతం పొందనివి, నమోదు చేసుకున్నా ఎన్నికల్లో పోటీ చేయనివి.. వీటన్నింటినీ కలిపి గుర్తింపు పొందని పార్టీలుగా పరిగణనలోకి తీసుకున్నట్టు ఏడీఆర్ వెల్లడించింది.
ఇలాంటి పార్టీలు 2010లో 1,112 ఉండగా.. 2019 మార్చి నాటికి వీటి సంఖ్య 2,301కి చేరినట్టు తెలిపింది ఏడీఆర్. 2018-19 మధ్య ఈ తరహా పార్టీలు 9.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఇలాంటి పార్టీలు 653 ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(291), తమిళనాడు(184)లు ఉన్నట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: పాస్‌పోర్టుకు.. సోషల్ మీడియాకు 'లింక్'