భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అంగీకరించరంది. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా గమనించాలని తెలిపింది.
ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని గత జూన్ నెలలో చెప్పగా.. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. దీంతో పోలీసులు ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
బెయిల్ కోసం యువకుడు దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు.
ఇదీ చూడండి: చట్టసభల పనితీరుపై జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు
ఇదీ చూడండి: సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు