ETV Bharat / bharat

బురదలో గేదెల్లా డ్యాన్స్​.. అక్కడ పెళ్లి పార్టీ స్పెషాలిటీ అదే! - chattisgarh tribes tradition

భారతదేశం భిన్న సంస్కృతి కలిగినది. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. ఒక్కో జాతికి ఒక్కో సంప్రదాయం. మరీ ముఖ్యంగా పెళ్లిలలో భిన్న సంప్రదాయాలుంటాయి. దేశంలో గిరిజనులు ఒక ప్రత్యేక జీవన శైలిని కలిగి ఉంటారు. దాంతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిదే ఛత్తీస్​గఢ్​లోని ఓ వర్గం వివాహ సంప్రదాయం కూడా చాలా వింతగా ఉంటుంది. మరి వారి కథేంటో తెలుసుకుందామా!

unique tradition of manjhi tribes in their marriage rituals in chattisgarh
మాంఝీ తెగలో సోదరి వివాహంలో గేదెలుగా వేషాలేసిన వ్యక్తులు
author img

By

Published : Mar 2, 2023, 4:50 PM IST

బురదలో గేదెల్లా డ్యాన్స్​.. అక్కడ పెళ్లి పార్టీ స్పెషాలిటీ అదే!

గేదెలుగా వేషాలు వేసుకొని, బురదలో దొర్లుతూ వరుడిని ఇంటికి స్వాగతించడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఛత్తీస్​గఢ్​లోని సుర్గుజా జిల్లాకు వెళ్తే ఈ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు! మాంఝా తెగకు చెందిన భైంసా గోత్ర ప్రజలు.. వివాహం సందర్భంగా ఇలా వరుడిని ఆహ్వానిస్తుంటారు.

మైన్​పట్​ ప్రాంతంలోని నర్మదాపుర్​ ప్రాంతంలో ఉండే ఈ ప్రజల సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు వధువు సోదరులు గేదెల మాదిరిగా వేషాలు వేస్తుంటారు. నడుము వెనుక ఓ తోకను తగిలించుకొని.. బురదలోకి దిగుతారు. గేదె మాదిరిగా ప్రవర్తిస్తూ.. బురదలో పడి దొర్లడం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం, పరిగెత్తడం లాంటివి చేస్తుంటారు. ఒక మనిషి వచ్చి కర్రతో తరిమినప్పుడు పారిపోవడం, పిలిస్తే రావడం లాంటివి చేస్తారు.

"మా చెల్లికి వివాహం జరుగుతోంది. మా భైంసా గోత్రంలోని వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మా కుల ఆచారం ప్రకారం బురదలో ఆడి పెళ్లి ఊరేగింపును ఇంటికి ఆహ్వానిస్తాం."

-చితాన్ సాయి, పెళ్లి కూతురు సోదరుడు

"అమ్మాయి సోదరులు బురదలో ఆడి పాటలు, డ్యాన్స్​లతో ఊరేగింపుకు వెళ్లి, వరుడిని ఇంటికి తీసుకొస్తాము."

-వధువు సోదరుడు చీతూ రామ్

ఆట, పాటలన్నీ పూర్తయ్యాక.. బురదలో నుంచి వీరు బయటకు వస్తారు. ఊరేగింపుగా వచ్చిన వరుడికి స్వాగతం పలికి.. ఇంటికి తీసుకెళ్తారు. ఈ విధంగా తరతరాలుగా వస్తున్న ఈ వివాహ సంప్రదాయాన్ని వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

"వారి కుల ఆచారం ప్రకారం వధువు సోదరులు బురదలో ఆడి ఆటపాటలతో ఊరేగింపుగా నవ దంపతులను ఇంటికి ఆహ్వానిస్తారు. వారి పూర్వీకుల సంప్రాదాయాన్ని వీరు కొనసాగిస్తున్నారు."

-గోపాల్ యాదవ్, స్థానిక నివాసి

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.