ETV Bharat / bharat

రెండు దూడలకు గ్రాండ్​గా పెళ్లి- డీజే పెట్టి బారాత్​, ఎక్కడో తెలుసా? - rare marriage

Unique Marriage Of Calfs : రెండు దూడలకు వివాహం జరిపించారు ఓ రైతు. దూడల పెళ్లికి భారీగా తరలివచ్చిన ప్రజలు ఊరేగింపు కార్యక్రమంలో డీజే పాటలకు డ్యాన్స్​ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Unique Marriage Of Calf
Unique Marriage Of Calf
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 12:54 PM IST

రెండు దూడలకు గ్రాండ్​గా పెళ్లి- డీజే పెట్టి బారాత్​, ఎక్కడో తెలుసా?

Unique Marriage Of Calfs : దూడలకు ఘనంగా వివాహం జరిపించారు ఓ రైతు. అచ్చం మనుషుల పెళ్లి మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపులో గ్రామస్థులు డ్యాన్స్​లతో అదరగొట్టారు. గోసంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రైతు తెలిపాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇదీ జరిగింది
శ్రావస్తిలోని రాంపుర్ కటేల్ గ్రామానికి చెందిన భభూతి ప్రసాద్ వద్ద నందిని అనే ఓ దూడ ఉంది. తన దూడకు వివాహం జరిపించాలని ఆయన భావించారు. ఇందుకోసం బహ్రైచ్ జిల్లాకు చెందిన నిహానియ కుట్టి అనే రైతుతో మాట్లాడి దూడల పెళ్లికి ఏర్పాట్లు చేశారు. దూడల పెళ్లికి డిసెంబర్ 26న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రెండు దూడలకు తిలకం దిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు పెళ్లి కార్డులను సైతం ప్రింట్ చేయించారు. తెలిసిన వారందరికీ దూడల పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రాలను పంపించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు ఇద్దరు రైతులు.

ఎట్టకేలకు దూడల వివాహ కార్యక్రమాన్ని డిసెంబర్​ 26న ఇద్దరి రైతులు ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు రాంపుర్​ కటేల్​ గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య దూడల కళ్యాణం అత్యంగా వైభవంగా జరిగింది. అనంతరం రెండు దూడలనూ ట్రాక్టర్​పై కూర్చోపెట్టారు. ఆపై వధువు దూడ ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో గ్రామస్థులు డీజే పాటలకు స్టెప్పులు వేశారు. రెండు దూడల పెళ్లి చేసి గోసంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని రైతు భభూతి ప్రసాద్ తెలియజేశారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేశానని చెప్పాడు.

పెళ్లికి అతిథులుగా ఎద్దులు
నిరంతరం పొలంలో పనిచేస్తూ జీవనాధారంగా ఉన్న ఎద్దులపై వినూత్నంగా ప్రేమను చూపాడు ఓ వ్యక్తి. తన పెళ్లికి వాటిని అతిథులుగా తీసుకువచ్చాడు. అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఓ స్టేజీని ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లిలో ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంఘటన కర్ణాటకలో కొన్నాళ్ల క్రితం జరిగింది. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

రుగుజ్జుల 'మళ్లీ పెళ్లి'.. వాటికోసమే రెండోసారి వివాహం

ప్రధాని ఎవరో చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు​.. అక్కడికక్కడే వరుడి తమ్ముడితో ఆమెకు మరో వివాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.