65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో డీజే పాటలకు హుషారుగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో జరిగిందీ సంఘటన.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హుసైనాబాద్ పూరే చౌధరి గ్రామానికి చెందిన నఖేద్ యాదవ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఆరుగురు కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత అతడి భార్య చనిపోయింది. కష్టపడి కుమార్తెలను పెంచి పెళ్లిళ్లు చేశాడు.
![65 year old man having six daughters married 23 year girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-vridh-ne-ki-shadi-visual-up10135_05022023193752_0502f_1675606072_837.jpg)
అప్పటి నుంచి నఖేద్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కుటుంబసభ్యుల అంగీకారంతో రుదౌలీ ప్రాంతంలో కామాఖ్యదేవి ఆలయంలో 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి.
![65 year old man having six daughters married 23 year girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-vridh-ne-ki-shadi-visual-up10135_05022023193752_0502f_1675606072_168.jpg)
పెళ్లి తర్వాత బరాత్ కూడా ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో నఖేద్ ఆరుగురు కుమార్తెలు, బంధువులు హుషారుగా నృత్యాలు చేశారు. 65 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకుగా మారిన నఖేద్ కూడా జోరుగా డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం వీరి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![65 year old man having six daughters married 23 year girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-vridh-ne-ki-shadi-visual-up10135_05022023193752_0502f_1675606072_599.jpg)