కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కంచన్ గడ్కరీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో శనివారం టీకా స్వీకరించారు.
దిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు టీకా వేశారు.
మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ కూడా బెంగళూరులో కొవిడ్ టీకా అందుకున్నారు.
ఆధ్యాత్మిక గురువు దలైలామా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల జోనల్ ఆసుపత్రిలో ఆయన టీకా స్వీకరించారు. ఈ సందర్భంగా అందరి శ్రేయస్సు కోసం ప్రజలు పెద్దఎత్తున వచ్చి టీకా తీసుకోవాలని దలైలామా కోరారు. ఆయనకు వ్యాక్సిన్ అందించినందుకు భారత ప్రభుత్వానికి దలైలామా కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి: 'కుండ్లీ ఎక్స్‌ప్రెస్‌వే'ను దిగ్బంధించిన రైతులు