ETV Bharat / bharat

'బ్లాక్​ ఫంగస్​ను 'సాంక్రమిక' చట్టం కింద గుర్తించాలి'

బ్లాక్​ ఫంగస్(మ్యూకర్​మైకోసిస్) వ్యాధిని సాంక్రమిక వ్యాధి చట్టం- 1897 కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. బ్లాక్​ ఫంగస్​ వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

mucormycosis
బ్లాక్​ఫంగస్​
author img

By

Published : May 20, 2021, 2:41 PM IST

దేశంలో బ్లాక్​ఫంగస్​(మ్యూకర్​మైకోసిస్) వ్యాధి క్రమంగా విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్​ ఫంగస్​ను సాంక్రమిక వ్యాధి చట్టం- 1897 కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బ్లాక్​ ఫంగస్​ వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

ప్రత్యేక కేంద్రాలు..

బ్లాక్​ ఫంగస్​ వ్యాధి చికిత్సకు దిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో బ్లాక్​ఫంగస్​ కేసులు పెరుగుతున్న క్రమంలో ఉన్నతాధికారులు, నిపుణులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు.

" సమావేశంలో మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. దిల్లీలోని లోక్​ నాయక్​ జయప్రకాశ్​ నారాయణ్​ ఆస్పత్రి, గురు తేజ్ బహదూర్ ఆస్పత్రి, రాజీవ్ గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో బ్లాక్​ఫంగస్​ వ్యాధి చికిత్సకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం."

-- అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

బ్లాక్ ఫంగస్​ చికిత్సకు సరిపడా ఔషధాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. బ్లాక్​ఫంగస్​ వ్యాప్తిని కట్టడిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి : పెళ్లికి హాజరైన వారితో కప్పగంతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.