Covid Situation in Southern States: ఎనిమిది దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీలో పురోగతి, వైరస్‌పై పోరుకు రాష్ట్రాలు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టిసారించాలన్నారు.
కరోనా కట్టిడికి పరీక్షల నిర్వహణ, ట్రేసింగ్, చికిత్స, కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఐదంచెల వ్యూహాన్ని కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో టీకాల పంపిణీ విజయవంతంగా సాగుతుందన్నారు. పరస్పర అవగాహనతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఇది సాధ్యపడిందన్నారు.
మరికొన్ని రాష్ట్రాలతో భేటీ
పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, బంగాల్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి, వైద్య సదుపాయాలను కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల అధికారులతో భేటీ కానున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారని మర్మాంగాన్ని చూపిస్తూ..